రామ్ చరణ్‌కు బైబై చెప్పి.. మరో స్టార్ హీరోకి హాయ్ చెప్పిన కెవిన్

17-08-2026

Pic credit - Instagram

Phani Ch

రామ్ చరణ్ ఈవెంట్లలో భారీ కటౌట్, స్టైలిష్ లుక్స్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన ఇంటర్నేషనల్ బాడీగార్డ్ కెవిన్ కుంటా గురించి అందరికి తెలిసిన విషయమే.

ఆఫ్రికాలోని గాంబియా దేశానికి చెందిన ప్రొఫెషనల్ MMA ఫైటర్ కెవిన్. గత నాలుగేళ్లుగా రామ్ చరణ్ కుటుంబానికి నమ్మకమైన బాడీగార్డ్‌గా సేవలందిస్తూ దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించారు.

రామ్ చరణ్ సినిమా ప్రమోషన్స్, బహిరంగ వేదికల్లో అభిమానులు ఒక్కసారిగా దూసుకొచ్చినప్పుడు కెవిన్ వారిని ఒంటిచేత్తో సునాయాసంగా పక్కకు నెట్టేసే దృశ్యాలు గతంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

రామ్ చరణ్ కూడా పలు ఇంటర్వ్యూలలో తన బాడీగార్డ్ పాపులారిటీ గురించి సరదాగా ముచ్చటిస్తూ కెవిన్ సేవలను ప్రశంసించారు. అయితే ఇప్పుడు కెవిన్ కుంటా మెగా టీమ్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సినీ వర్గాల సమాచారం ప్రకారం, కెవిన్ కుంటా ఇకపై రామ్ చరణ్ వ్యక్తిగత భద్రతా బృందంలో కాకుండా.. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున వద్ద పర్సనల్ బాడీగార్డ్‌గా చేరినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

ఇటీవల అక్కినేని నాగార్జున హాజరైన ఒక ప్రత్యేక కార్యక్రమంలో కెవిన్ కుంటా ఆయన వెంటే ఉంటూ పటిష్ట భద్రత కల్పిస్తూ కనిపించారు. ఈ దృశ్యాలు నెట్టింట దర్శనమివ్వడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

కెవిన్ కుంటా రామ్ చరణ్ నుంచి నాగార్జున భద్రతా టీమ్‌లోకి షిఫ్ట్ అవ్వడం చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు.. "కెవిన్ కూడా పార్టీ మారారు" అంటూ సోషల్ మీడియాలో సరదా కామెంట్లతో తెగ సందడి చేస్తున్నారు.