AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train Accident: దేశ చరిత్రలో అతిపెద్ద రైలు ప్రమాదం ఇదే.. 8 వందలకు పైగా మృతి..!

ఈ ప్రమాదంలో సుమారు 300 మంది మరణించారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.  కానీ, స్థానిక నివాసితులు, అనేక మీడియా నివేదికలు మాత్రం మరణించిన వారి సంఖ్య 800, 900 మధ్య ఉంటారని చెప్పారు. ఇది భారతదేశంలోనే అత్యంత ఘోరమైన రైల్వే ప్రమాదంగా, ప్రపంచంలో రెండవ అతిపెద్ద ప్రమాదంగా నిలిచింది. ప్రమాదం జరిగిన తర్వాత చాలా రోజుల పాటు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

Train Accident: దేశ చరిత్రలో అతిపెద్ద రైలు ప్రమాదం ఇదే.. 8 వందలకు పైగా మృతి..!
Biggest Train Accident
Jyothi Gadda
|

Updated on: Jun 05, 2023 | 6:56 AM

Share

ఒడిశాలోని బాలాసోర్‌లో జూన్‌2న జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్‌ దేశాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. బెంగళూరు- హౌరా సూపర్​ఫాస్ట్​ ఎక్స్​ప్రెస్​, షాలిమార్​- చెన్నై సెంట్రల్​ కోరమండల్​ ఎక్స్​ప్రెస్​, గూడ్స్​ రైలు.. బాలాసోర్​లోని బహనాగా బజార్​ స్టేషన్​కు సమీపంలో ప్రమాదానికి గురయ్యాయి. ప్యాసింజర్​ రైళ్లల్లో సుమారు 2,500మంది ప్రయాణికులు ఉండగా.. 288మంది ప్రాణాలు కోల్పోయారు. 1000కిపైగా మంది గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలను కనుగొనేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అశ్విని వైష్ణవ్​, ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్​, బంగాల్​ సీఎం మమతా బెనర్జీతో పాటు అనేక మంది నేతలు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబసభ్యులను, క్షతగాత్రులను పరామర్శించారు. ఇక ఈ ప్రమాదం చాలా భయంకరమైనదిగా విపత్తు నిర్వహణ సంస్థ గుర్తించింది. ఒడిశాలోని బాలసోర్ లో జరిగిన ఇప్పటి రైలు ప్రమాదం కూడా  దేశంలోని అతిపెద్ద రైల్వే ప్రమాదాల జాబితాలో చేర్చింది.. రైల్వే చరిత్రలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదాల గురించి తెలుసుకుందాం..

భారతదేశంలోనే అతిపెద్ద రైలు ప్రమాదం..

భారతీయ రైల్వే చరిత్రలో అతిపెద్ద రైలు ప్రమాదం 1981లో జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 800 మంది ప్రాణాలు కోల్పోయారు. అది జూన్ 6, 1981. అప్పట్లో 9-కోచ్‌ల ప్యాసింజర్ రైలు ప్రయాణికులతో నిండిపోయి ఉంది. వర్షం కురుస్తున్న సాయంత్రం మాన్సీని సహర్సాకు బయలుదేరింది. బాగ్మతి నది బద్లా ఘాట్, ఢమరా ఘాట్ స్టేషన్ల మధ్య మార్గంలో 416DNనంబర్‌ రైలు ప్రయాణిస్తుంది. ఈ ప్యాసింజర్ రైలు నదిపై నిర్మించిన బ్రిడ్జి నంబర్-51 మీదుగా వెళ్తుండగా అకస్మాత్తుగా నదిలో పడిపోయింది. రైలులోని చివరి 7 కోచ్‌లు రైలు నుంచి విడిపోయి నదిలో పడిపోయాయి. వర్షాకాలంలో బాగమతి నీటిమట్టం కూడా బాగా పెరగడంతో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నిండు కుండలా ఉన్న నదిలో వంతెనపై ప్రయాణిస్తున్న రైలు ఒక్కసారిగా కుప్పకూలి నదిలో మునిగిపోయింది.

రైలులోని ఆ 7 కోచ్‌లలోని ప్రజలను రక్షించేందుకు అక్కడ ఎవరూ లేరు. సమీపంలోని ప్రజలు నదికి చేరుకునేలోపే వందలాది మంది నదిలో మునిగి చనిపోయారు. ఈ ప్రమాదం భారతదేశంలోనే అత్యంత ఘోరమైన రైల్వే ప్రమాదంగా, ప్రపంచంలో రెండవ అతిపెద్ద ప్రమాదంగా నిలిచింది. ప్రమాదం జరిగిన తర్వాత చాలా రోజుల పాటు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 5 రోజుల పాటు నిర్వీరామంగా సెర్చ్‌ ఆపరేషన్ నిర్వహించారు. సుమారు 200కి పైగా మృతదేహాలను నదిలోంచి వెలికితీసింది సెర్చ్‌ ఆపరేషన్‌ బృందం. ఈ ప్రమాదంలో సుమారు 300 మంది మరణించారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.  కానీ, స్థానిక నివాసితులు, అనేక మీడియా నివేదికలు మాత్రం మరణించిన వారి సంఖ్య 800, 900 మధ్య ఉంటారని చెప్పారు.

ఇవి కూడా చదవండి

అయితే, ఈ ప్రమాదానికి అనేక కారణాలు చెబుతున్నారు. పెను తుపాను వల్లే ప్రమాదం జరిగిందని కొందరు అంటున్నారు. నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతోనే ప్రమాదం జరిగిందని కొందరు అంటున్నారు. అంతే కాకుండా బ్రిడ్జిపైకి వచ్చిన ఓ ఆవును రక్షించేందుకు లోకో పైలట్ రైలుకు సడన్ బ్రేక్ వేశాడని, దీంతో రైలులోని చివరి 7 కోచ్‌లు బోల్తాపడి బ్రిడ్జి విరిగిపోయి రైలు కోచ్‌లు నదిలో పడిపోయాయని కూడా కొందరు చెబుతుంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..