Odisha Train Accident: టికెట్ లేకుండా ప్రయాణించిన వారికి కూడా పరిహారం అందజేస్తాం.. రైల్వేశాఖ కీలక ప్రకటన
రైలులో ప్రయాణించే వారిలో కొంతమంది టికెట్ లేకుండానే ప్రయాణం చేస్తారు. వాస్తవానికి టికెట్ లేకుండా ప్రయాణించడం నేరం.ఎవరైనా అధికారుల కంటపడితే జరిమాన చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ రైలు ప్రమాదానికి గురైతే టికెట్ లేని వారికి అప్పట్లో రైల్వేశాఖ పరిహారం కూడా చెల్లించేది కాదు.
రైలులో ప్రయాణించే వారిలో కొంతమంది టికెట్ లేకుండానే ప్రయాణం చేస్తారు. వాస్తవానికి టికెట్ లేకుండా ప్రయాణించడం నేరం.ఎవరైనా అధికారుల కంటపడితే జరిమాన చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ రైలు ప్రమాదానికి గురైతే టికెట్ లేని వారికి అప్పట్లో రైల్వేశాఖ పరిహారం కూడా చెల్లించేది కాదు. అయితే ఇప్పుడు ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. ఈ దుర్ఘటనలో టికెట్ లేని ప్రయాణికులకు కూడా పరిహారం చెల్లించనుంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకన్నట్లు తెలిపింది.
ప్రయాణికులకు టికెట్ ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఈ రైలు ప్రమాదానికి గురైన వారందరికీ పరిహారం అందుతుందని రైల్వే ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు. గాయపడిన వారికి సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు.. మృతదేహాలు తీసుకెళ్లేందుకు బాధిత కుటుంబ సభ్యులు 139 అనే హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫోన్ చేయవచ్చని మరో అధికారి పేర్కొన్నారు. ప్రయాణానానికి అయ్యే ఖర్చులు కూడా తామే భరిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ రైలు ప్రమాదం జరగడంతో పది రైళ్లను పాక్షికంగా.. 123 రైళ్లను పూర్తిగా రద్దు తేశారు. దాదాపు 56 రైళ్లను దారి మళ్లించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి