Odisha train tragedy: మానవ తప్పిదమా..? కుట్ర కోణమా..? ఒడిశాలో మూడు రైళ్ళు ఢీకొన్న దారుణ ఘటనలో అదే జరిగిందా..
కనీవినీ ఎరుగని మహా విషాదం జరిగిపోయింది. వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అయినా ఇప్పటికింకా ఈ ప్రమాదానికి కారణాలు తేలలేదు. అయితే తాజాగా ఈ ఘోర ప్రమాదం వెనుక దాగి ఉన్న కుట్రకోణం హడలెత్తిస్తోంది. మరోవైపు రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్ వ్యాఖ్యలూ.. ఇంకో వైపు రైల్వే బోర్డు సభ్యులు జయవర్మ ప్రకటనలు అనేక అనుమానాలకు తెరతీస్తున్నాయి.

ఒడిశాలో మూడు రైళ్ళు ఢీకొన్న దారుణ ఘటనకు మానవ తప్పిదమే కారణమా? లేక ఇందులో ఏదైనా కుట్రకోణం దాగివుందా? వందలాది మంది పాలిట మృత్యుశకటంగా మారిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం అసలెలా జరిగింది? ఇదే ఇప్పుడు యావత్ భారతాన్ని హడలెత్తిస్తోంది. ఒడిశా రైలు ప్రమాదానికి కారణమేంటో తేలిపోయిందనీ… ప్రమాదానికి కారణమేమిటో క్లారిటీ వచ్చేసిందనీ, ప్రమాదానికి దారితీసిన మూల కారణాన్ని పసిగట్టేశామని ప్రకటించారు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ మార్పు వల్లే ఈ ఘోరం జరిగినట్టు నిర్ధారించారు. పూర్తి నివేదిక సమర్పించిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.
కానీ రైల్వే బోర్డు సభ్యులు జయవర్మ మీడియా సమక్షంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు మరోరకంగా ఉన్నాయి. సిస్టమ్ ఫెయిల్యూర్ అయి వుంటే రెడ్ సిగ్నల్స్ పడేవనీ, అయితే ఇక్కడలా జరగలేదంటున్నారు జయవర్మ. అలాగే ఎలాంటి ఎర్రర్ వచ్చినా సిస్టమ్ సిగ్నల్స్ రెడ్‌లోకి వెళ్తుందని అంతే కాదు జయవర్మ అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు ఐదు అంశాలు కారణమై ఉండొచ్చన్నారు జయవర్మ.
సందిగ్ధం … ఓ మహా విషాదం వెనుక ఏం జరిగిందన్న సందిగ్ధం మృతుల కుటుంబాలను బెంబేలెత్తిస్తోంది. ఇది మానవ తప్పిదమా? లేక ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యా? ఈ ఘోర ప్రమాదం వెనుక ఎవరి హస్తం దాగి ఉంది? కుట్రకోణమే నిజమైతే… అసలేం జరిగి ఉంటుంది?
ఇవే అనుమానాలతో బహానగా బజార్ రైల్వే స్టేషన్‌లో సైతం అధికారుల తనిఖీలు చేస్తున్నారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. అనుమతి లేని వ్యక్తులు ఎవరైనా స్టేషన్ మాస్టర్ రూంలోకి ప్రవేశించారా? రిలే రూంలోకి వచ్చి ఏవైనా మార్పులు చేశారా అన్నదానిపై అధికారులు దృష్టి సారించారు. సిగ్నల్ వ్యవస్థ ఫెయిల్ అయిందా లేదా ఎవరైనా ట్యాంపర్ చేశారా అనేది సీబీఐ దర్యాప్తులో తేలాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం