ఫుల్‌టైమ్‌ కూతురిగా జాబ్‌ ఆఫర్.. నెలకు జీతం ఎంతంటే ??

ఫుల్‌టైమ్‌ కూతురిగా జాబ్‌ ఆఫర్.. నెలకు జీతం ఎంతంటే ??

Phani CH

|

Updated on: Jun 04, 2023 | 10:01 AM

పిల్లలు పెద్దయ్యాక తమను పట్టించుకోవడం లేదని, వారితో సమయం గడిపే అవకాశమే లేకుండా పోతుందని తల్లిదండ్రులు చెప్పడం ఈ రోజుల్లో సర్వసాధారణం. పిల్లలు సంపాదన ప్రయత్నాల్లో బిజీగా గడపడం కారణం. చైనాలోని ఓ తల్లిదండ్రులు దీనికి గొప్ప పరిష్కారం కనుగొన్నారు.

పిల్లలు పెద్దయ్యాక తమను పట్టించుకోవడం లేదని, వారితో సమయం గడిపే అవకాశమే లేకుండా పోతుందని తల్లిదండ్రులు చెప్పడం ఈ రోజుల్లో సర్వసాధారణం. పిల్లలు సంపాదన ప్రయత్నాల్లో బిజీగా గడపడం కారణం. చైనాలోని ఓ తల్లిదండ్రులు దీనికి గొప్ప పరిష్కారం కనుగొన్నారు. తమ కుమార్తెను పూర్తి సమయం తమతోనే గడిపేందుకు ప్రత్యేకించి జీతం ఇచ్చి నియమించుకున్నారు. కుమార్తె పూర్తి సమయం వారితోనే గడపడానికి ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెకు నెలకు 4,000 యువాన్లు అంటే భారత కరెన్సీ ప్రకారం నెలకు 47 వేల రూపాయలు ఇస్తారు. తల్లిదండ్రులు ఇలాంటి ఆఫర్ చేయడంతో 40 ఏళ్ల కుమార్తె తన కార్పొరేట్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. చైనీస్ వార్తా సంస్థలో 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న 40 ఏళ్ల కూతురు కొంతకాలంగా ఒత్తిడిని ఎదుర్కొంది. ఫుల్‌టైమ్‌ కూతురిగా మారితే నెలకు 47 వేల రూపాయలు ఇస్తామన్న ఆ తల్లిదండ్రుల ప్రతిపాదనను వారి కూతురు అంగీకరించింది. ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఓ నివేదికలో వెల్లడించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శుభమా అని పెళ్లి చేసుకుంటే.. ఇదేంట్రా బాబూ

3నెలల శిశువును ముద్దాడేందుకు యత్నించిన ఒరంగుటాన్.. హృదయాలను కట్టిపడేస్తున్న వీడియో

శవంపై కూర్చొని అఘోరా పూజలు.. తమిళనాడులో కలకలం సృష్టించిన ఘటన

Chiranjeevi: నాకు క్యాన్సర్ రాలేదు.. తప్పుగా అర్థం చేసుకున్నారు..

Adipurush: 500కోట్ల పెట్టుబడి వచ్చేసింది.. దిమ్మతిరిగేలా చేస్తున్న ఆదిపురుష్ కలెక్షన్స్

 

Published on: Jun 04, 2023 09:58 AM