Ashwini Vaishnaw శభాష్ మినిస్టర్ గారూ.. అందరికీ ఆదర్శంగా నిలిచిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్..
ఇంతటి ఘోర ప్రమాదం తర్వాత.. కేవలం 51 గంటల్లో ట్రాక్ పునరుద్ధరణ జరిగిందంటే దానికి కారణం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చొరవేనని చెప్పాలి. అందరు నేతల మాదిరి కాకుండా.. హుటాహుటిన అక్కడికి వెళ్లారు. ప్రమాదాన్ని అణువణువునా పరిశీలించారు. సహాయచర్యల్ని అనుక్షణం దగ్గరుండీ పర్యవేక్షిస్తూ రైల్వే అధికారులకు, సిబ్బందికి ఆదర్శంగా నిలిచిపోయారు.
ఇంతటి ఘోర ప్రమాదం తర్వాత.. కేవలం 51 గంటల్లో ట్రాక్ పునరుద్ధరణ జరిగిందంటే దానికి కారణం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చొరవేనని చెప్పాలి. అందరు నేతల మాదిరి కాకుండా.. హుటాహుటిన అక్కడికి వెళ్లారు. ప్రమాదాన్ని అణువణువునా పరిశీలించారు. సహాయచర్యల్ని అనుక్షణం దగ్గరుండీ పర్యవేక్షిస్తూ రైల్వే అధికారులకు, సిబ్బందికి ఆదర్శంగా నిలిచిపోయారు. ఓ వైపు ప్రమాదానికి గల కారణాలపై అన్వేషిస్తూనే ఇంకో వైపు సహాయక చర్యలు ఊపందుకునేలా అధికారుల్ని పరిగెత్తించారు. ఈ రెండురోజులూ అక్కడే ఉండిపోయి.. రెండు కాళ్లపై నిలబడిపోయి.. నిరంతర పర్యవేక్షణ చేశారు. పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలపై ఆరాతీశారు. ప్రమాదానికి గురైన ట్రాక్ మరమ్మత్తులు, ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో వేగం పెరిగేలా చూశారు. గతంలో రైల్వే మంత్రులుగా పనిచేసిన వాళ్లకంటే అశ్వినీ వైష్ణవ్ ఈ విషయంలో చాలా భిన్నంగా కనిపించారు.
దండం పెట్టిన అశ్వినీ వైష్ణవ్..
ఇదిలాఉంటే.. ప్రమాదస్థలంలో ధ్వంసమైన ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తిచేసి, రైలు ట్రయన్ రన్ నిర్వహించారు. తొలుత గూడ్స్ రైలును రన్ చేశారు. ఆ తరువాత మిగతా రైళ్లను ట్రయల్స్ వేశారు. అయితే, ఈ సందర్భంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్.. ట్రెయిన్ ట్రయల్ నడుస్తుండగా రెండు జోడించి నమస్కరించారు. ట్రైన్ ట్రయల్ రన్ సక్సెస్ కోసం ప్రార్థించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
Down-line restoration complete. First train movement in section. pic.twitter.com/cXy3jUOJQ2
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 4, 2023
గతంలో స్టేట్‌మెంట్లకే పరిమితం..
గతంలో ప్రమాదాలు జరిగినప్పుడు రైల్వే మంత్రులుగా ఉన్న వాళ్లు స్టేట్‌మెంట్లకే పరిమితం అయ్యారు. స్పాట్‌కి వెళ్లడం ఫోటోలు దిగడం సానుభూతి ప్రకటనలతో చల్లగా జారుకోవడం చూశాం. ఇక పునరుద్దరణ పనులు దేవుడెరుగు. నెలల తరబడి పనులు జరిగేవి. స్వయంగా పర్యవేక్షించాల్సిన మంత్రులు తమకేం పోయిందిలే అన్నట్టుగా చేతులెత్తేశారు. అన్నింటిని అధికారులకే వదిలేసేవారు. ఫలితంగా రోజుల తరబడి ప్రజలు అసౌకర్యానికి గురయ్యేవాళ్లు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.. బాలసోర్ ప్రమాదం జరిగిన 48 గంటల్లోనే పరిస్థితి ఎలా ఉందో కనిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..