Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: కనీవినీ ఎరుగని సెక్స్ ఛాంపియన్‌షిప్.. 16 దశల్లో కాంపిటీషన్.. ఎక్కడ? ఎప్పుడు? వివరాలివే..

చాలా దేశాల్లో ఇప్పటికీ లైంగిక పరమైన అంశాల గురించి బహిరంగంగా మాట్లాడేందుకు ప్రజలు సంశయిస్తారు. ఆ పదం వినగానే.. అదేదో అంటరాని, పలక కూడని పదంగా భావిస్తుంటారు. ఇలాంటి పరిస్థితిలో ఏకంగా.. సెక్స్ ఛాంపియన్‌షిప్‌ను ఏర్పాటు చేస్తే? అదును, అలాంటి సాహసానికి స్వీడన్ సిద్ధమైంది. ఈ పోటీ జూన్ 8 నుండి ప్రారంభమవుతుంది.

Viral: కనీవినీ ఎరుగని సెక్స్ ఛాంపియన్‌షిప్.. 16 దశల్లో కాంపిటీషన్.. ఎక్కడ? ఎప్పుడు? వివరాలివే..
European Sex Championship
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 04, 2023 | 6:35 AM

చాలా దేశాల్లో ఇప్పటికీ లైంగిక పరమైన అంశాల గురించి బహిరంగంగా మాట్లాడేందుకు ప్రజలు సంశయిస్తారు. ఆ పదం వినగానే.. అదేదో అంటరాని, పలక కూడని పదంగా భావిస్తుంటారు. ఇలాంటి పరిస్థితిలో ఏకంగా.. సెక్స్ ఛాంపియన్‌షిప్‌ను ఏర్పాటు చేస్తే? అదును, అలాంటి సాహసానికి స్వీడన్ సిద్ధమైంది. ఈ పోటీ జూన్ 8 నుండి ప్రారంభమవుతుంది. ఈ చాంపియన్‌షిప్‌పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ‘ఈ ఛాంపియన్‌షిప్‌ను ఏ ఛానెల్‌లో ప్రసారం చేస్తారు’ అనే ప్రశ్నలు తలెత్తాయి.

స్వీడన్ దీనిని సెక్స్ క్రీడగా పరిగణిస్తుంది. అందుకే ఛాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తున్నారు. ఈ పోటీని స్వీడిష్ సెక్స్ ఫెడరేషన్ నిర్వహిస్తోంది. జూన్ 8 నుంచి కొన్ని వారాల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఇక కంటెస్టెంట్స్ కోసం చాలా రూల్స్ పెట్టారు. దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి.

రోజుకు 6 గంటలు పోటీ..

ఈ క్రీడల్లో పాల్గొనాలంటే చాలా శక్తి ఉండాలి. ప్రతి ఆరు గంటలకు మ్యాచ్ జరుగుతుంది. పోటీదారులు 45 నిమిషాల నుండి 60 నిమిషాల వరకు పాల్గొనాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఈ ఛాంపియన్‌షిప్ ఎలా వస్తుందోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి

పేరు నమోదు..

ఈ ఛాంపియన్‌షిప్‌కు ఇప్పటికే ఫుల్ డిమాండ్ వస్తోంది. వివిధ దేశాల నుంచి 20 మంది పోటీదారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. రాబోయే రోజుల్లో మరింత మంది తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశం ఉంది.

జడ్జి కూడా ఉన్నారు..

సెక్స్ ఛాంపియన్‌షిప్‌ను ఇతర ఆటల మాదిరిగానే నిర్వహిస్తున్నారు. ముగ్గురు జ్యూరీలు ఉంటారు. జ్యూరీ నిర్ణయమే అంతిమం కాదు. ఇక్కడ ప్రేక్షకుల ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతి కంటెస్టెంట్ తదుపరి స్థాయికి వెళ్లాలంటే కనీసం స్కోర్ చేయాలనే నియమం ఉంటుంది. పోటీదారునికి 5, 10 మార్కులు ఇస్తారు.

విభిన్న దశలు..

స్విమ్మింగ్ పోటీలో వివిధ రకాల రౌండ్లు ఉంటాయి. అలాగే సెక్స్ ఛాంపియన్‌లోనూ వివిధ దశల్లో పోటీసులు ఉంటాయి. 16 దశల్లో పోటీలు జరగనున్నాయి. సాధారణ సెక్స్, ఓరల్ సెక్స్ తదితర స్టేజీల్లో పోటీలు నిర్వహించనున్నారు.

ఫెడరేషన్ ఏం చెబుతోంది?

ఈ మేరకు స్వీడిష్ సెక్స్ ఫెడరేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేవారికి సృజనాత్మకత, తెలివితేటలు, ఊహ, శారీరక బలం, ఓర్పు అవసరం. అవసరమైనప్పుడు నిబంధనలు మార్చుకుంటూ ముందుకు సాగుతాం’’ అని సెక్స్ ఫెడరేషన్ పేర్కొంది.

సోషల్ మీడియాలో రచ్చ..

సోషల్ మీడియాలో ఈ పోటీపై జోరుగా చర్చ జరుగుతోంది. చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు పోటీలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..