- Telugu News Photo Gallery IRCTC: confirm train ticket journey date change without canceled know more details
Indian Railways: ఇక ట్రైన్ టిక్కెట్ రద్దు చేసుకోవాల్సిన పనిలేదు.. ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు.. వివరాలివే..
Indian Railways: చాలా మందికి చివరి క్షణాలలో వారి ప్రయాణం వాయిదా పడుతుంటుంది. దాంతో టిక్కెట్ క్యాన్సిల్ చేసుకుంటారు. అయితే, ఇండియన్ రైల్వేస్ న్యూ రూల్ ప్రకారం.. ప్రయాణికులు ఇక టిక్కెట్ రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు. బదులుగా ప్రయాణ తేదీని మార్చుకునే వెలుసుబాటు ఉంది. దీనికి ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. వివరాలు తెలుసుకుందాం..
Updated on: Jun 03, 2023 | 6:57 AM

Indian Railways: చాలా మందికి చివరి క్షణాలలో వారి ప్రయాణం వాయిదా పడుతుంటుంది. దాంతో టిక్కెట్ క్యాన్సిల్ చేసుకుంటారు. అయితే, ఇండియన్ రైల్వేస్ న్యూ రూల్ ప్రకారం.. ప్రయాణికులు ఇక టిక్కెట్ రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు. బదులుగా ప్రయాణ తేదీని మార్చుకునే వెలుసుబాటు ఉంది. దీనికి ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. వివరాలు తెలుసుకుందాం..

భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వేస్. రైళ్లలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతోంది ఇండియన్ రైల్వేస్. తాజాగా కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

చాలామంది ప్రజలు తమ ప్రయాణానికి కొంతకాలం ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. అయితే, ప్రయాణ సమయం దగ్గర పడగానే ప్లాన్ మార్చుకుని టికెట్ రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.

Train

అలాగే కొత్త తేదీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ మీరు తరగతిని అప్‌గ్రేడ్ చేసే ఆప్షన్ కూడా పొందుతారు. దరఖాస్తును స్వీకరించిన తర్వాత, మీ ప్రయాణ తేదీ, తరగతి రెండూ మారుస్తారు.

తేదీని మార్చినందుకు అదనంగా ఎలాంటి రుసుము తీసుకోరు. అయితే, తరగతిని మార్చినట్లయితే, ఆ తరగతి ఛార్జీల ఆధారంగా డబ్బు వసూలు చేస్తారు.