- Telugu News Photo Gallery Spiritual photos Astrology: ashadha month 2023 never do these mistake to avoid problem ashadh month dos and donts
Ashadha 2023: ఆషాఢ మాసంలో ఈ పొరపాటు అస్సలు చేయొద్దు.. అన్నీ కష్టాలే ఎదురవుతాయ్..!
ఆషాఢం 5 జూన్ నుండి 3 జూలై 2023 వరకు కొనసాగుతుంది. ఆషాఢ మాసంలో కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రజల విశ్వాసం. అయితే ప్రతి నెలలాగే ఈ మాసంలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని పాటించిన వారికి మంచి ఫలితాలు లభిస్తాయి.
Updated on: Jun 03, 2023 | 6:55 AM

ఆషాఢం 5 జూన్ నుండి 3 జూలై 2023 వరకు కొనసాగుతుంది. ఆషాఢ మాసంలో కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రజల విశ్వాసం. అయితే ప్రతి నెలలాగే ఈ మాసంలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని పాటించిన వారికి మంచి ఫలితాలు లభిస్తాయి.

ఆషాఢ మాసంలో ఆలస్యంగా నిద్రించడం నిషిద్ధం. ఇలా చేయడం వల్ల, లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది. ఫలితంగా సదరు వ్యక్తులు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

ఆషాఢమాసంలోని దేవశయని ఏకాదశి నుండి చాతుర్మాస్ ప్రారంభమవుతుంది. పెళ్లి, కేశఖండన, గృహ ప్రవేశం, ఉపనయనం వంటి పనులు పొరపాటున కూడా చేయొద్దు. ఈ పనులు చేయడం వల్ల అశుభం కలుగుతుంది. జీవితంలో కష్టాలు ఎదురవుతాయి. వివాహాలు చేసినా అవి ఫలవంతం అవవు.

ఆషాఢం నుండి వర్షాలు మొదలవుతాయి. ఇలాంటి పరిస్థితిలో క్రిముల వృద్ధి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆహారం, పానీయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చల్లారిన, మరుసటి రోజు ఆహారాన్ని తినడం మానుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఆషాఢమాసంలో ఆకు కూరలు, తీగ కూరలు, మాంసం, చేపలు, మద్యం, బెండకాయలు, పప్పులు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు తినకూడదు. ఉపవాసం, జపం చేసినా ఫలం లభించదు. దుర్వాసనతో కూడిన వస్తువులను రోజులలో తినకూడదు. ఇవి కామాన్ని పెంచుతాయి. శరీరంలో మలినాలను, మనస్సులో దురాలోచనలను పెంచుతాయి.

ఆషాఢమాసంలో దేవతలు నిద్రించిన తర్వాత అసుర శక్తులు ప్రబలుతాయి. ఇది మన ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ మాసంలో మీ మాటలపై నిగ్రహం పాటించాలి. ఎక్కువ సమయం దైవరాధనలో గడపాలి. దీనివల్ల అసుర శక్తులు ఆధిపత్యం చెలాయించవు.





























