- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips for Broom: Never do these mistakes with broom maa lakshmi disappoint with this
Vastu Tips for Broom: చీపురు విషయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. సర్వం కోల్పోవాల్సి వస్తుంది..!
Vastu Tips for Broom: హిందూ మతంలో చీపురుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చీపురుని లక్ష్మీ దేవికి రూపంగా పరిగణిస్తారు. అయితే, చీపురుకు సంబంధించిన కొన్ని నియమాలు పాటిస్తే ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఎప్పుడూ ఉంటుంది. కొన్నిసార్లు వాస్తుకు సంబంధించి చేసే తప్పులు.. ఆర్థిక సంక్షోభానికి, అనారోగ్యానికి కారణం అవుతుంది. మరి ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Updated on: Jun 03, 2023 | 6:25 AM

వాస్తు ప్రకారం.. చీపురును ఎల్లప్పుడూ సరైన దిశలో ఉంచాలి. చీపురును ఈశాన్య దిశలో ఉంచొద్దు. ఈ దిశలో చీపురు పెడితే ఆర్థిక నష్టం జరుగుతుంది.

ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఊడ్చొద్దు. ఇలా చేయడం వల్ల వారు చేసే పనిలో విజయం సాధించలేరు. ఆర్థిక సమస్యలు కూడా తలెత్తుతాయి.

చీపురు ఎప్పుడూ అలాంటి చోటే ఉంచాలని, ఎవరూ చూడని చోటే ఉంచాలని చెబుతారు. చీపురును ఏదైనా బహిరంగ ప్రదేశంలో ఉంచితే వాస్తు దోషాలు వస్తాయి.

చీపురుపై ఎప్పుడూ అడుగు పెట్టకూడదు. చీపురుపై అడుగు పెడితే లక్ష్మీదేవిని అవమానించినట్లే. ఇలా చేయడం వల్ల ఇంట్లో వాస్తు దోషం సమస్య రావచ్చు.

చీపురు ఎప్పుడూ పడకగదిలో లేదా మంచం కింద, వంటగదిలో ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మొదలవుతాయి.