ధను రాశి: వ్యక్తిగత సమస్యలు, బంధుమిత్రుల వల్ల తలెత్తిన సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. సమయస్ఫూర్తితో, సొంత తెలివితేటలతో శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం కలుగుతుంది. ఒక పథకం ప్రకారం లేదా ఒక వ్యూహం ప్రకారం కొన్ని ముఖ్యమైన ఇబ్బందులు, కష్టాలకు తెరదించడం జరుగు తుంది. చాలాకాలంగా పీడిస్తున్న ఈ సమస్య లను దూరం పెట్టడానికి ధృఢ సంకల్పంతో వ్యవహరించడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా అధికారులు లేదా యజమానుల నుంచి కొంతకాలంగా ఎదురవుతున్న వేధింపులు కూడా తొలగిపోవచ్చు.