AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: జీవితంలో విజయాలు సాధించాలంటే.. ఈ విషయాలను అధిక ప్రాధాన్యత నివ్వాలంటున్న చాణక్య..

చాణక్యుడు బోధించిన మాటలను చాణక్య నీతి, చాణక్య సూత్రం అని కూడా అంటారు. చాణక్యుడు తన తెలివితేటలతో ఎన్నో రకాల విషయాలలో మనిషి ఎలా మెలగాలో వివరించాడు. ఈ భరత భూమిపై ఎప్పుడో కామన్ ఎరా కంటే ముందు జన్మించిన చాణక్యుడు.. తన నీతి సూత్రాలతో నేటి సమాజాన్ని కూడా ప్రభావితం చేయగలుగుతున్నాడు. ఆచార్య చాణక్యుడు స్వతహాగానే పాలన, రాజకీయాలు, నీతిశాస్త్రం, ఆర్థికశాస్త్రం, నీతి బోధనలలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. అలాంటి చాణక్యుడు విజయం పొందడానికి మనిషి తప్పక ప్రాధాన్యం ఇవ్వవలసిన విషయాలు కొన్ని ఉన్నాయని బోధించాడు. అవేమిటో ఇప్పుడు చూద్దాం..

శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 02, 2023 | 7:48 AM

Share
జ్ఞానం, నైపుణ్యం: విజయం సాధించేందుకు జ్ఞానాన్ని పొందడం, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం చాలా ముఖ్యమని ఆచార్య చాణక్యుడు తన విధివిధానాల ద్వారా నొక్కొ చెప్పాడు. జ్ఞానం అనేది ఒక వ్యక్తి కలిగి ఉండగల అత్యంత శక్తివంతమైన ఆస్తి, నిరంతర అభ్యాసం ద్వారా దాన్ని అభివృద్ధి పరుచుకోవచ్చని పేర్కొన్నాడు.  వ్యక్తిని తాను కోరుకున్న గమ్యస్థానానికి తీసుకెళ్లడంలో జ్ఞానం, నైపుణ్యం ఎంతో సహాయకరంగా ఉంటుందని, వాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నాడు.

1 / 5
Chanakya Niti: జీవితంలో విజయాలు సాధించాలంటే.. ఈ విషయాలను అధిక ప్రాధాన్యత నివ్వాలంటున్న చాణక్య..

2 / 5
ఆర్థిక లావాదేవీలు: చాణక్యడు అర్థిక శాస్త్రంలో మహా మేధావి. ఆ నేపథ్యంలోనే అర్థిక లావాదేవీలపై మనిషి జాగ్రత్తగా ఉండాలని, అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలని సూచించాడు. డబ్బును ఎప్పుడు ఎలా ఖర్చు చేయాలో తెలిసి వ్యక్తి.. దాన్ని ఆదా చేసుకుని కష్టకాలంలో కదలకుండా ఉంటాడని.. అందువల్ల ఆర్థిక పరమైన విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నాడు.

3 / 5
సానుకూల ఆలోచనలను పెంపొందించుకోండి: జీవితంలోని సానుకూల అంశాలపై దృష్టి సారించాలని అలాగే మనస్సును అందుకు అనుగుణంగా తగిన శిక్షణ ఇవ్వాలని చాణక్యుడు నమ్మాడు. ఇలా చేయడం వలన సానుకూల ఆలోచనలు, కృతజ్ఞత, ఆశావాదాన్ని పెంపొందించుకోండి. ఇలా చేయడం వలన మీలో  ఉత్సాహం పెరుగుతుంది. సమతుల్య భావాన్ని అందిస్తుంది.

4 / 5
సంబంధాలు, సామాజిక వ్యవహారాలు: ఇతరులతో బలమైన సంబంధాల, సామరస్యపూర్వకమైన సామాజిక పరస్పర చర్యల ప్రాముఖ్యలను చాణక్యుడు పేర్కొన్నాడు. ఈ విధమైన సంబంధాలు కష్టకాలంలో సహకారంగా ఉంటాయని, వాటిలో నమ్మకం,విధేయత, గౌరవం ఉండాలన్నాడు. ఇది వ్యక్తిత్వాన్ని, హోదాను మెరుగుపరుస్తుందని కూడా చెప్పాడు.

5 / 5