AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ రాశికి ఈ రంగులు సరిపోవు.. వేసుకున్నారంటే అదృష్టం తిరగబడుద్ది..!

Zodiac Colors To Avoid: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రంగులు కూడా మనిషి భావోద్వేగాలు, ప్రవర్తన, మొత్తం శక్తిపై ప్రభావం చూపుతాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ప్రతి రాశికి కొన్ని రంగులు శుభప్రదంగా ఉంటే, కొన్ని రంగులు ప్రతికూల ప్రభావాన్ని కలిగించవచ్చని నమ్మకం. సరైన రంగులను ధరిస్తే శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కానీ అనుకూలం కాని రంగులు ధరించడం వల్ల సవాళ్లు, ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉందని అంటారు.

మీ రాశికి ఈ రంగులు సరిపోవు.. వేసుకున్నారంటే అదృష్టం తిరగబడుద్ది..!
Rashifal Kcolours
Rajashekher G
|

Updated on: Mar 07, 2026 | 8:33 PM

Share

జ్యోతిషశాస్త్రం ప్రకారం మనిషి నామ నక్షత్రం, జన్మ నక్షత్రం ఆధారంగా జీవితంలోని మంచి-చెడులను వివరించవచ్చు. అంతేకాకుండా ఎవరు ఎలాంటి పరిహారాలు చేయాలి, ఏ లోహాలు లేదా రత్నాలు ధరించాలి వంటి అనేక విషయాలను కూడా జ్యోతిష్యం తెలియజేస్తుంది. ఇదే సమయంలో రంగులు కూడా మనిషి భావోద్వేగాలు, ప్రవర్తన, మొత్తం శక్తిపై ప్రభావం చూపుతాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ప్రతి రాశికి కొన్ని రంగులు శుభప్రదంగా ఉంటే, కొన్ని రంగులు ప్రతికూల ప్రభావాన్ని కలిగించవచ్చని నమ్మకం. సరైన రంగులను ధరిస్తే శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కానీ అనుకూలం కాని రంగులు ధరించడం వల్ల సవాళ్లు, ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉందని అంటారు. అందుకే ఏ రాశి వారు ఏ రంగులను నివారించాలి తెలుసుకుందాం.

  • మేష రాశి: ఈ రాశి వారికి నలుపు రంగు అనుకూలం కాదు. పొరపాటున కూడా నలుపు రంగు దుస్తులు ధరించకుండా ఉండటం మంచిది. ఈ రంగు కారణంగా ప్రారంభించే పనుల్లో ఆలస్యం కలగవచ్చు.
  • వృషభ రాశి: వృషభ రాశి వారు ముదురు నీలం రంగు దుస్తులను దూరంగా ఉంచాలి. ఈ రంగు వల్ల రాహు ప్రభావం పెరిగి మానసికంగా అస్థిరత కలగవచ్చని జ్యోతిష్యం చెబుతోంది.
  • మిథున రాశి: ఈ రాశి వారు పసుపు, మెరూన్ రంగులను నివారించడం మంచిది. బృహస్పతి ప్రభావం పెరిగి అనవసర సమస్యలు లేదా శత్రువులు ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తారు.
  • కర్కాటక రాశి: కర్కాటక రాశి వారు నలుపు రంగు దుస్తులను తగ్గించాలి. ఈ రంగు కారణంగా భావోద్వేగాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది.
  • సింహ రాశి: సింహ రాశి వారికి ఎక్కువ రంగులు సరిపోతాయి. అయితే ఎరుపు రంగు దుస్తులను ఎక్కువగా ధరించకుండా ఉండటం మంచిది. ఇది కుజ ప్రభావాన్ని పెంచి దూకుడును పెంచవచ్చు.
  • కన్య రాశి: ఈ రాశి వారు పాస్టెల్ లేదా లేత రంగులను తగ్గించడం మంచిది. వీరు చిన్న విషయాలకు ఎక్కువగా స్పందించే స్వభావం కలిగి ఉండటంతో ముదురు రంగులు వారికి అనుకూలంగా ఉంటాయి.
  • తులా రాశి: తులా రాశి వారు ముదురు నీలం, నారింజ రంగులను నివారించాలి. ఇవి రాహు ప్రభావాన్ని పెంచి మనసులో అస్థిరతను కలిగించవచ్చు.
  • వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండటం మంచిది. లేకపోతే శని ప్రభావం ఎక్కువయ్యే అవకాశం ఉంది.
  • ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారు తెలుపు రంగు దుస్తులను ఎక్కువగా ధరించకూడదు. ఇది చంద్రుడి ప్రభావాన్ని పెంచి భావోద్వేగాలను పెంచవచ్చు.
  • మకర రాశి: మకర రాశి వారు ఆకుపచ్చ రంగును తగ్గించాలి. ఈ రంగు బుధ ప్రభావాన్ని పెంచి మానసిక ఒత్తిడిని కలిగించవచ్చని అంటారు.
  • కుంభ రాశి: కుంభ రాశి వారు పసుపు రంగుకు దూరంగా ఉండటం మంచిది. ఇది బృహస్పతి ప్రభావాన్ని పెంచి అనవసర విషయాలపై దృష్టి పెట్టేలా చేయవచ్చు.
  • మీన రాశి: మీన రాశి వారు ఎరుపు రంగు దుస్తులను తగ్గించాలి. ఈ రంగు కుజ ప్రభావాన్ని పెంచి దూకుడు స్వభావాన్ని కలిగించవచ్చు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..