AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: ఇండియన్ రైల్వేస్ బంపర్ ఆఫర్.. జస్ట్ రూ. 905 తో 7 జ్యోతిర్లింగాలను దర్శించుకోండి..

IRCTC Tour Package: దైవ దర్శనాలకు వెళ్లాలనుకుంటున్నారా? ఆది దేవుడు పరమ శివుడు కొలువుదీరిన జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనుకుంటున్నారా? మీ, వద్ద అంత బడ్జెట్ లేదని చింతిస్తున్నారా? అయితే, ఇప్పుడు ఆ టెన్షన్‌ను వదిలిపెట్టండి. మీ చేబులో డబ్బులు లేకపోయినా.. జ్యోతిర్లింగాలను దర్శించుకునే అద్భుతమైన ఆఫర్‌ను ఐఆర్‌సీటీసీ తీసుకువచ్చింది.

IRCTC: ఇండియన్ రైల్వేస్ బంపర్ ఆఫర్.. జస్ట్ రూ. 905 తో 7 జ్యోతిర్లింగాలను దర్శించుకోండి..
Irctc Tourism
Shiva Prajapati
|

Updated on: Jun 03, 2023 | 6:53 AM

Share

IRCTC Tour Package: దైవ దర్శనాలకు వెళ్లాలనుకుంటున్నారా? ఆది దేవుడు పరమ శివుడు కొలువుదీరిన జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనుకుంటున్నారా? మీ, వద్ద అంత బడ్జెట్ లేదని చింతిస్తున్నారా? అయితే, ఇప్పుడు ఆ టెన్షన్‌ను వదిలిపెట్టండి. మీ చేబులో డబ్బులు లేకపోయినా.. జ్యోతిర్లింగాలను దర్శించుకునే అద్భుతమైన ఆఫర్‌ను ఐఆర్‌సీటీసీ తీసుకువచ్చింది. రూ. 905 తోనే జ్యోతిర్లింగాల దర్శనాన్ని అందిస్తోంది. అంటే, ఈ టూర్‌కు అయ్యే ఖర్చునే ఒకేసారి కట్టలేని వారు.. నెల నెల రూ. 905 తో ఈఎంఐ కట్టి జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చన్నమాట. ఇంతమంచి ఆఫర్‌కు సంబంధించిన వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఐఆర్‌సీటీసీ 7 జ్యోతిర్లింగాల దర్శనానికి టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ యాత్ర 9 పగలు, 10 రాత్రులు ఉంటుంది. యూపీలోని గోరఖ్‌పూర్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు.. భక్తులను 7 జ్యోతిర్లింగాల వద్దకు తీసుకువెళుతుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్‌లో ఈ ప్రయాణం సాగుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో ద్వారకాధీష్ ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. యూపీలోని గోరఖ్‌పూర్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు భక్తులను 7 జ్యోతిర్లింగాల వద్దకు తీసుకువెళుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ ప్రదేశాలను సందర్శించవచ్చు..

మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, సోమనాథ్, నాగేశ్వర్, భీమశంకర్, ఘృష్ణేశ్వర్, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాలను సందర్శించడానికి గోరఖ్‌పూర్ నుండి ఈ రైలు నడుస్తుందని ఐఆర్‌సీటీసీ ట్వీట్ చేసింది. గోరఖ్‌పూర్, బస్తీ, మాన్కాపూర్ జంక్షన్, అయోధ్య కాంట్, బారాబంకి జంక్షన్, లక్నో, కాన్పూర్, ఒరై, వీరాంగన లక్ష్మీ బాయి స్టేషన్లలో బోర్డింగ్/డి-బోర్డింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ పర్యటనలో అనేక రకాల సౌకర్యాలు ఉంటాయి. ఈ యాత్ర జూన్ 22 నుంచి ప్రారంభం కానుంది. ప్యాకేజీ ప్రారంభ ధర 18,466. అదే సమయంలో, ఐఆర్‌సీటీసీ వివిధ వర్గాలకు వేర్వేరుగా వసూలు చేస్తోంది. ఒకేసారి ఇంతమొత్తం చెల్లించలేని వారు నెల నెల ఈఎంఐ రూపంలోనూ రూ. 905 చొప్పున చెల్లించే అవకాశం కల్పిస్తోంది.

టూర్ ప్యాకేజీ కాస్ట్ వివరాలు..

1. ఈ టూర్ ప్యాకేజీ కింద ఒక వ్యక్తికి 2AC కోసం మొత్తం రూ.40,603 చెల్లించాల్సి ఉంటుంది. 2. 3 AC కోసం ఒక వ్యక్తి రూ. 30,668 చెల్లించాలి. 3. స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించే వారు రూ.18,466 చెల్లించాల్సి ఉంటుంది. 4. ప్రయాణ సమయంలో రైలులో వివిధ తరగతులు ప్రయాణించే సౌకర్యం కల్పిస్తున్నారు.

ఇవి తప్పనిసరి..

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ఐఆర్‌సీటీసీ ప్రయాణికులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ టూర్‌కు వచ్చే ప్రయాణికులు.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా ధృవీకరణ పత్రం ఉండాలి. అలాగే, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు తీసుకురావాలి. ఐఆర్‌సీటీసీ ఈ పర్యటనలో మతపరమైన ప్రదేశాల ప్రవేశ ఛార్జీ, బోటింగ్ ఛార్జీ వంటివి చేర్చలేదు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ www.irctctourism.comలో ఆన్‌లైన్ బుకింగ్ చేయవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..