Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NASA: ప్లూటో గ్రహంపై ‘లవ్ సింబల్’.. బ్యూటీఫుల్ పిక్‌ని పోస్ట్ చేసిన నాసా.. మిస్సవ్వకండి..!

సౌర వ్యవస్థలో తొమ్మిది గ్రహాలు ఉంటే.. వాటిలో చివరిదైన ప్లూటోకు గ్రహం స్థాయిని తొలగించారు. చిన్నగా ఉండటం చేత.. ప్లూటోను మరుగుజ్జు గ్రహం అని కూడా పిలుస్తారు. దీనికి గ్రహం స్థాయి తొలగించి కూడా చాలా ఏళ్లు గడుస్తున్నాయి. అయితే, తాజాగా ఓ అద్భుతమైన దృశ్యం ఆ గ్రహంపై సాక్షాత్కరించింది. ఆ దృశ్యంతో మళ్లీ ఇప్పుడు హాట్ డిస్కర్షన్‌గా మారింది ప్లూటో.

NASA: ప్లూటో గ్రహంపై ‘లవ్ సింబల్’.. బ్యూటీఫుల్ పిక్‌ని పోస్ట్ చేసిన నాసా.. మిస్సవ్వకండి..!
Pluto
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 02, 2023 | 8:15 AM

సౌర వ్యవస్థలో తొమ్మిది గ్రహాలు ఉంటే.. వాటిలో చివరిదైన ప్లూటోకు గ్రహం స్థాయిని తొలగించారు. చిన్నగా ఉండటం చేత.. ప్లూటోను మరుగుజ్జు గ్రహం అని కూడా పిలుస్తారు. దీనికి గ్రహం స్థాయి తొలగించి కూడా చాలా ఏళ్లు గడుస్తున్నాయి. అయితే, తాజాగా ఓ అద్భుతమైన దృశ్యం ఆ గ్రహంపై సాక్షాత్కరించింది. ఆ దృశ్యంతో మళ్లీ ఇప్పుడు హాట్ డిస్కర్షన్‌గా మారింది ప్లూటో. ఈ బ్యూటీఫుల్ దృశ్యాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ విడుదల చేసింది. ఆ ఫోటో ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కారణం.. దానిపై ఏర్పడిన అందమైన హృదయ రూపం. తాజాగా నాసా ప్లూటో ఫోటోను షేర్ చేసింది. దాని ఉపరితలపై ‘లవ్ సింబల్’ ఆకారంలో హిమానీనదం ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇన్‌స్టాగ్రమ్‌లో ఈ పిక్‌ను షేర్ చేసిన నాసా.. ‘మా న్యూ హారిజన్స్ అంతరిక్ష నౌక.. ఈ హార్ట్ షేప్‌లో ఉన్న హిమానీ నదాన్ని గుర్తించింది. ఇది ప్లూటో ఉపరితలంపై ఉంది. ఇందులో పర్వతాలు, శిఖరాలు, లోయలు, క్రేటర్లు, మైదనాలు కూడా ఉన్నాయి. ఇది మీథేన్, నైట్రోజన్‌తో కూడిన మంచుతో ఏర్పడి ఉండొచ్చు. ప్లూటో కైపర్ బెల్ట్‌లో ఉంది. ఇది నెప్ట్యూన్ కక్ష్యకు ఆవల మన సౌర వ్యవస్థ ప్రారంభ రోజుల నుండి మంచుతో కప్పబడిన అవశేషాలతో డోనట్ ఆకారంలో ఉంది. ఈ చిన్న మంచు ప్రపంచం సూర్యుని నుండి సగటున 3.7 బిలియన్ మైళ్ళు (5.9 బిలియన్ కిలోమీటర్లు) దూరంలో ఉంది. అయితే దాని ఓవల్-ఆకారపు కక్ష్య ప్లూటోని నెప్ట్యూన్ కంటే దగ్గరగా కనిపించేలా చేస్తుంది. సూర్యుడికి దగ్గరగా ఉన్నందున దీనిపై తేలికపాటి వాతావరణం కలిగి ఉంటుంది.’’ అని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

నాసా షేర్ చేసిన ఫోటోకు ఇప్పటి వరకు సుమారుగా 12 లక్షల లైక్స్ వచ్చాయి. ఈ అందమైన దృశ్యాన్ని చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు. మరికొందరు ప్లూటోకు మళ్లీ గ్రహం స్థాయి కల్పించాలని కోరుతున్నారు.

View this post on Instagram

A post shared by NASA (@nasa)

మరిన్ని సైన్స్&టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..