- Telugu News Photo Gallery Science photos New technology can generate electricity from humidity in air, Says US Scientists
Electricity by Air: గాలి నుంచే కరెంట్ తయారీ.. సైన్స్ రంగంలో కొత్త ఆవిష్కరణ.. ఎలా ఉత్పత్తి చేస్తారంటే..?
Electricity by Air: అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్సిటీ పరిశోధకులు గాలి నుంచి విద్యుత్‌ను తయారు చేశారు. సదరు శాస్త్రవేత్తలు గాలి నుంచి విద్యుత్‌ని తయారు చేసే కొత్త పద్ధతిని అభివృద్ధి చేశామని, దీనితో 24 గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేయవచ్చని పేర్కొన్నారు.
Updated on: Jun 02, 2023 | 6:38 AM

నీరు, సౌరశక్తి నుంచి విద్యుత్ తయారీ అవుతుందన్న విషయం మనందరికీ తెలుసు. అయితే తాజాగా గాలి నుండి విద్యుత్తు కూడా ఉత్పత్తి చేయవచ్చని సైంటిస్టులు కనుగొన్నారు. అవును, అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్సిటీ పరిశోధకులు గాలి నుంచి విద్యుత్‌ను తయారు చేశారు. విద్యుత్‌ను తయారు చేసే శాస్త్రవేత్తలు 24 గంటల పాటు దానిని సరఫరా చేసేలా కొత్త పద్ధతిని రూపొందించినట్లు చెప్పారు. దీని వల్ల నిరంతర విద్యుత్ సరఫరా చేయవచ్చు. అసలు గాలి నుంచి విద్యుత్ ఎలా తయారు చేయబడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

గాలి సహాయంతో విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రత్యేక పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ కొత్త పరికరం గాలిలో ఎప్పుడూ ఉండే తేమ సహాయంతో విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఇంకా విద్యుత్తును ఉత్పత్తి చేసే ఈ పద్ధతి పర్యావరణానికి హానిని కూడా నివారిస్తుంది.

శాస్త్రవేత్తల ప్రకారం గాలిలోని తేమలో ప్రతి నీటి అణువుకు ఛార్జ్ ఉంటుంది, విద్యుత్తును ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రారంభ దశలో శాస్త్రవేత్తలు తక్కువ స్థాయిలో విద్యుత్తును ఉత్పత్తి చేశారు. వారు విద్యుత్తును ఉత్పత్తి చేసిన పరికరంలో 100 నానోమీటర్ల కంటే చిన్న రంధ్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇదే విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగ పడి ఉండవచ్చు.

శాస్త్రవేత్తలు కనుగొన్న కొత్త పరికరంలోని 100 నానోమీటర్ల కంటే చిన్న రంధ్రం గుండా గాలి వెళ్ళినప్పుడు, అందులోని నీటి అణువులు లేదా తేమ కూడా అక్కడకు చేరుతుంది. అలా చేరినప్పుడు అప్పుడు అవి విద్యుత్ చార్జ్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీనిని జెనరిక్ ఎయిర్ జెన్ ఎఫెక్ట్ అంటారు.

ఇది చాలా ఆసక్తికరమైన ఆవిష్కరణ అని, ఇప్పటి వరకు అలాంటి విద్యుత్తును ఉత్పత్తి చేసే పద్ధతి ఏదీ కనుగొనబడలేదు అని పరిశోధకుడు జియావో లియు చెప్పారు. తమ ప్రయోగం ద్వారా గాలి నుంచి స్వచ్ఛమైన విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి తలుపులు తెరిచామని, ఈ విధంగా కర్బన ఉద్గారాలు ఉండవు లేదా పర్యావరణానికి ఎటువంటి హాని కలుగదని సదరు సైంటిస్టు తెలిపారు.





























