Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Making: శృంగారం తరువాత సిగరెట్ తాగుతున్నారా? ఈ నిజం తెలిస్తే గుండె గుంభేల్..!

చాలామంది పురుషులు తమ భాగస్వామితో శృంగారం తరువాత సిగరెట్ తాగుతూ రిలాక్స్ అవుతారు. కొందరికి అది ఒక అలవాటుగా ఉంటుంది. అయితే, ఈ అలవాటే వారి కొంప ముంచుతుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. అవును, శారీరక కలయిక తరువాత సిగరెట్ తాగే అలవాటు ఉన్నవారికి పెను ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, ఏరికోరి వ్యాధులను ఆహ్వానిస్తారని చెబుతున్నారు.

Love Making: శృంగారం తరువాత సిగరెట్ తాగుతున్నారా? ఈ నిజం తెలిస్తే గుండె గుంభేల్..!
Cigarettes
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 01, 2023 | 8:00 AM

చాలామంది పురుషులు తమ భాగస్వామితో శృంగారం తరువాత సిగరెట్ తాగుతూ రిలాక్స్ అవుతారు. కొందరికి అది ఒక అలవాటుగా ఉంటుంది. అయితే, ఈ అలవాటే వారి కొంప ముంచుతుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. అవును, శారీరక కలయిక తరువాత సిగరెట్ తాగే అలవాటు ఉన్నవారికి పెను ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, ఏరికోరి వ్యాధులను ఆహ్వానిస్తారని చెబుతున్నారు.

శృంగారం తరువాత సిగరెట్ తాగితే ఏమవుతుంది? వైద్యులు ఏం చెబుతున్నారు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. వాస్తవానికి ధూమపానం అనేక విధాలుగా ఆరోగ్యానికి చేటు చేస్తుంది. శ్వాసకోశ సమస్యతో పాటు, హృదయానాళాల పనితీరును సైతం దెబ్బతీస్తుంది. అంతేకాదు.. ధూమపానం లైంగిక సామర్థ్యాన్ని కూడా దెబ్బతీస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

లైంగిక సామర్థ్యం తగ్గుతుంది..

పొగాకు వినియోగం వల్ల లైంగిక ఆరోగ్యం క్షీణిస్తుంది. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులలో నికోటిన్ ఉంటుంది. ఇది రక్త నళాలను దెబ్బతీస్తుంది. జననేంద్రియాలు సహా శరీరం అంతటా రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. రక్త ప్రసరణలో బలహీనత పురుషులలో అంగస్తంభన (ED)కి దారితీస్తుంది. స్త్రీలలో లైంగిక ప్రేరేపణ, సరళత తగ్గుతుంది. అంతేకాదు.. ధూమపానం వల్ల పురుషులు, స్త్రీలలో సంతానోత్పత్తి రేటు తగ్గుతుంది. గర్భం దాల్చడం కష్టతరం అవుతుంది.

ఇవి కూడా చదవండి

అంటువ్యాధులు ప్రబలే అవకాశం..

ధూమపానం చేయడం వలన లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు (STI) వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ధూమపానం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనమవుతుంది. ఫలితంగా STI(లైంగిక వ్యాధులు) సంక్రమణకు కారణం అవుతుంది. ధూమపానం ఇన్‌ఫెక్షన్‌లతో పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

సైకలాజికల్, ఎమోషనల్ ఎఫెక్ట్..

ధూమపానం వల్ల మానసికంగా వీక్ అవుతారు. సన్నిహిత సంబంధాలపై మానసిక, భావోద్వేగ ప్రభావాన్ని చూపుతుంది. ధూమపానం వల్ల లైంగిక పరమైన కోరికలు పెరుగుతాయి. ఉద్రేకానికి లోనవుతారు. అయితే, ఇదే అలవాటు నిరంతరంగా కొనసాగితే.. ధూమపానం చేయకుండా లైంగిక కార్యకలాపాలలో పాల్గొనే సామర్థ్యం తగ్గుతుంది. ఇకపోతే.. ధూమపానం అధికంగా చేసే వారి కారణంగా తమ భాగస్వామిలో లైంగిక అసంతృప్తి కలగడం, సాన్నిహిత్యం తగ్గడం వంటివి జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

మరి ఏం చేయాలి?

లైంగిక ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలన్నా.. మానసికంగా దృఢంగా ఉండాలన్నా.. మీ భాగస్వామితో సాన్నిహిత్యం బాగుండాలన్నా.. ధూమపానం మానేయడం ఉత్తమమైన మార్గం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ధూమపానం మానేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. అంటు వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు. ఇక క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, యోగా వంటి కార్యకలాపాలు మీ జీవితాన్ని సుఖమయం చేస్తాయని చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..