Bumper Offer : రోజుకు రూ. 20 వేల జీతం.. పనేంటో తెలిస్తే నేనూ వెళ్తానని ఎగిరి గంతేస్తారు..!
ప్రపంచ వ్యాప్తంగా టాప్ కంపెనీల్లో ఉద్యోగాల కోత నడుస్తోంది. చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దాంతో ప్రజలు నిరుద్యోగంతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. కరోనా మహమ్మారి తరువాత చాలామంది పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. అనేక కంపెనీలు మూతపడ్డాయి.
ప్రపంచ వ్యాప్తంగా టాప్ కంపెనీల్లో ఉద్యోగాల కోత నడుస్తోంది. చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దాంతో ప్రజలు నిరుద్యోగంతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. కరోనా మహమ్మారి తరువాత చాలామంది పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. అనేక కంపెనీలు మూతపడ్డాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. ఇప్పటికీ ఆ తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉద్యోగాలను వదిలి.. సొంతూళ్లకు వచ్చి చిన్నా చితకా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో తాజాగా ఓ విచిత్ర ఉద్యోగ ప్రకటన వచ్చింది. చేసే పని కూడా చాలా వింతంగా ఉంటుంది. జీతం మాత్రం భారీగానే ఉంది. అవును, రోజుకు రూ.20 వేల జీతంతో ఉద్యోగ అవకాశం కల్పిస్తోంది. మరి ఎక్కడ ఉద్యోగం? ఏం పని? ఇంట్రస్టింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
యూకేలో చిప్స్ చిప్పీ అనే కంపెనీ ఉంది. ఇది విట్బీ హార్బర్‌లో ఉంది. ఈ కంపెనీ ఒక వింత ఉద్యోగం కోసం ప్రకటన జారీ చేసింది. పక్షులను తరమడమే ఉద్యోగి పని. ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తి.. పక్షులను సమర్థవంతంగా తరిమేస్తే సరిపోతుంది. పైగా ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి రోజుకు రూ. 20 వేల వేతనం కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంటే.. నెలకు రూ. 6 లక్షలు సంపాదించే అవకాశం ఉంది.
కంపెనీ చేపల చిప్స్‌ని తయారు చేస్తుంది..
ఇక్కడ పక్షులను తరిమికొట్టేందుకు ఇంత డబ్బు ఎందుకు ఇస్తుందని మీకు ఆలోచన రావొచ్చు. రావాలి కూడా. అయితే, దీని వెనుక పెద్ద కథే ఉంది. ఈ కంపెనీ చేపలతో చిప్స్ తయారు చేస్తుంది. ఇందుకోసం చేపలను వారు స్టోర్ చేస్తారు. అయితే, సీగల్ పక్షులకు చేపలంటే చాలా ఇష్టం. ఫలితంగా సీగల్స్ ఈ స్టోర్‌పై అటాక్ చేసి చేపలను దొంగిలించి తింటాయి. అందుకే.. ఆ చేపల దొంగలైన సీగల్స్‌ని తరిమివేయడం కోసం ప్రత్యేకంగా ఈ ఉద్యోగాన్ని క్రియేట్ చేసింది కంపెనీ. అయితే, చేపలను ఎత్తుకెళ్లే సీగల్స్ కొన్ని సందర్భాల్లో ఉద్యోగులపైనా దాడులు చేస్తున్నాయి. అందుకే.. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రమాదకరమైన పక్షులను తరిమికొట్టగల సమర్థత, శక్తి ఉన్న ఉద్యోగుల కోసం కంపెనీ వెతుకుతోంది. ఆ కారణంగానే రోజుకు రూ. 20 వేలు ఇచ్చేందుకు సైతం సిద్ధమైంది.
ఒకే ఒక్కడు సాధ్యం చేశాడు..
నివేదికల ప్రకారం.. చాలా మంది ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరికి సీగల్స్ తరిమే టెస్ట్ పెట్టారు. అయితే, ఎవరూ ఆ సీగల్స్‌ని తరిమివేయలేకపోయారు. చివరికి ఒక వ్యక్తి మాత్రం వాటిని తరిమికొట్టాడు. కోరీ అనే వ్యక్తి చాలా తెలివిగా ఆలోచించి.. సీగల్స్‌కు చెక్ పెట్టాడు. డేగ వేషం వేసుకుని వచ్చి సీగల్స్‌కు ఝలక్ ఇచ్చాడు. దెబ్బకు.. ఒక్క సీగల్ కూడా అ దరిదాపులోకి కూడా రాలేదు. అతని ఆలోచనకు కంపెనీ సైతం ఫిదా అయిపోయింది. అతన్ని ఉద్యోగానికి ఎంచుకుంది.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..