PM Kisan Updates: వీరు కూడా ఇప్పుడు ‘పీఎం కిసాన్’ పథకం ప్రయోజనం పొందవచ్చు.. వివరాలివే..

PM Kisan 14th Installment: చిన్న, సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకుని, పంట పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పేరుతో ఏటా రూ.6000 సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరు వేల రూపాయలను 3 విడతల్లో ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.

PM Kisan Updates: వీరు కూడా ఇప్పుడు ‘పీఎం కిసాన్’ పథకం ప్రయోజనం పొందవచ్చు.. వివరాలివే..
Pm Kisan
Follow us
Shiva Prajapati

|

Updated on: May 28, 2023 | 10:07 PM

చిన్న, సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకుని, పంట పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పేరుతో ఏటా రూ.6000 సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరు వేల రూపాయలను 3 విడతల్లో ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే, ఇదే పథకానికి సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రత్యేకంగా ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద గతంలో అందుకోని వాయిదాను ఇప్పుడు పొందుతారని చెబుతోంది. గత వాయిదాను అందుకోని రైతులు కూడా ఇప్పుడు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాన్ని పొందుతారని చెబుతోంది. ఇప్పటి వరకు ఈ పథకం లబ్ధి పొందని రైతులు.. ఇప్పుడు దీనిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది.

పాత వాయిదా కూడా పొందే అవకాశం..

అర్హులైన రైతులను ఈ పథకంలో చేర్చడమే కాకుండా.. ఇప్పటి వరకు కోల్పోయిన మొత్తాన్ని కూడా అందజేయనున్నారు. ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా రిజిస్ట్రేషన్, బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయడం, ఈ-కేవైసీ, తదితర పనులను పూర్తి చేస్తారు. ఆ తరువాత పథకం కింద లబ్ధిదారులైన రైతులకు మొత్తం నగదును విడుదల చేస్తారు. అర్హులని తేలితే పాత విడత డబ్బులు కూడా జమ చేస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.

55 వేల గ్రామ పంచాయతీల్లో ప్రచారం..

రైతులందరికీ ఈ పథకం కింద ప్రయోజనాలను అందించడానికి, యుపిలోని 55 వేల గ్రామ పంచాయతీలలో పిఎం కిసాన్ యోజన ప్రయోజనం చేకూర్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రైతుల కోసం దర్శన్ పోర్టల్ కూడా ప్రారంభించారు. దీని కింద అనేక గ్రాంట్లు, రిజిస్ట్రేషన్, ఇతర ప్రయోజనాలు ఇవ్వబడతాయి. ఈ క్యాంపెయిన్ జూన్ 10 వరకు కొనసాగుతుందని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి

10 లక్షల మంది రైతులు అనర్హులు..

యుపిలోని 10 లక్షల మంది రైతులు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అనర్హులుగా గుర్తించారు. ఈ రైతులను గుర్తించి పథకం నుంచి మినహాయిస్తారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు, 10 వేలకు పైగా పెన్షన్ పొందుతున్నవారు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. కాగా, 2.63 కోట్ల మంది రైతుల ధ్రువీకరణ తర్వాత 10 లక్షల మంది రైతులు అనర్హులుగా గుర్తించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..