అయితే, మామిడి పండ్లను ఎక్కువగా తింటే శరీరానికి హాని కలుగుతుంది. అతిగా తినడం వల్ల విరేచనాలు, కడుపునొప్పి, అల్సర్లు, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే మితంగా తినాలి. రోజులో ఒక తినడం వల్ల మేలు జరుగుతుంది. అది కూడా ఒక కాయను రెండు సమయాల్లో తింటే ఇంకా మేలని నిపుణులు చెబుతున్నారు.