Mirror Vastu Tips: ఇంట్లో అద్దం ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా? ఈ షాకింగ్ విషయం మీకోసమే..

స్త్రీ అయినా, పురుషుడైనా ప్రతి ఒక్కరూ తమ ముఖాన్ని చూసుకోవాలంటే ఇంట్లో అద్దం ఉండాల్సిందే. అద్దం లేని ఇల్లు ఉండదంటే ఉండదు. అయితే, ఈ అద్దాలు ముఖం చూసుకోవడానికే కాకుండా.. ఇంటి సౌందర్యాన్ని కూడా పెంచేలా రకరకాల డిజైన్లతో వస్తున్నాయి. అయితే, ఈ అద్దంతో ఆనందం, అదృష్టం కూడా ముడిపడి ఉందని మీకు తెలుసా?

Mirror Vastu Tips: ఇంట్లో అద్దం ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా? ఈ షాకింగ్ విషయం మీకోసమే..
Mirrior Vastu Tips
Follow us
Shiva Prajapati

|

Updated on: May 25, 2023 | 1:29 PM

స్త్రీ అయినా, పురుషుడైనా ప్రతి ఒక్కరూ తమ ముఖాన్ని చూసుకోవాలంటే ఇంట్లో అద్దం ఉండాల్సిందే. అద్దం లేని ఇల్లు ఉండదంటే ఉండదు. అయితే, ఈ అద్దాలు ముఖం చూసుకోవడానికే కాకుండా.. ఇంటి సౌందర్యాన్ని కూడా పెంచేలా రకరకాల డిజైన్లతో వస్తున్నాయి. అయితే, ఈ అద్దంతో ఆనందం, అదృష్టం కూడా ముడిపడి ఉందని మీకు తెలుసా? అద్దం అమర్చేటప్పుడు చేసే చిన్న పొరపాట్లు ఇంట్లో వాస్తు దోషాలను సృష్టిస్తాయి. వాస్తు నియమాల ప్రకారం ఇంట్లో అద్దం ఏర్పాటు చేసినట్లైతే.. ఆనందం, శ్రేయస్సును ఆకర్షిస్తుంది. మరి అద్దానికి సంబంధించిన వాస్తు నియమాలు, దోషాల గురించి వాస్తు శాస్త్రం ఏమి చెబుతుందో ఒకసారి చూద్దాం..

1. ఇంట్లో అద్దాన్ని అమర్చేటప్పుడు ముందుగా దిశను చూసుకోవాలి. ఇంటి ఉత్తర గోడపై అద్దం ఉండేలా చూసుకోవాలి. తూర్పు, లేదా, ఉత్తరం వైపు ముఖం చూసుకునేలా అద్దం ఏర్పాటు చేయాలని వాస్తు శాస్త్రంలో పేర్కొనడం జరిగింది.

2. ఇంట్లో పడకగదిలో ఎప్పుడూ అద్దం ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. దీని వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. అద్దంలో పడక ప్రతిబింబం వాస్తు దోషాలను సృష్టిస్తుంది. దీంతో ఆ ఇంట్లో నివసించే వారి జీవనం అస్తవ్యస్తంగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

3. ఇంట్లో అమర్చిన అద్దం ఎప్పుడూ మురికిగా ఉండకూడదు. వాస్తు ప్రకారం, మురికి అద్దం దుఃఖానికి కారణం అవుతుంది. అందుకే రోజూ శుభ్రం చేస్తూ ఉండాలి. ఉదయాన్నే నిద్రలేచి ముఖాన్ని అద్దంలో చూసుకోవడం మంచిది కాదు.

4. ఇంట్లో పగిలిపోయిన అద్దం వాడొద్దు.

5. వంటగది ముందు అద్దం పెట్టొద్దు. గ్యాస్ స్టవ్ జ్వాల గాజుపై ప్రతిబింబిస్తుంది. ఇది చేటు చేస్తుంది.

6. ఇంటిలోపల అష్టభుజి అద్దం అమర్చడం శుభప్రదంగా భావిస్తారు. అలాంటి అద్దం శుభప్రదం. అలాగే, బాత్రూంలో అమర్చిన అద్దం గేటు ముందు ఉండకూడదు.

7. ఇంటికి దక్షిణం, పడమర దిశలో అద్దం పెట్టడం వాస్తు ప్రకారం శ్రేయస్కరం కాదు. దీంతో ఇంట్లో గొడవలు మొదలవుతాయి. అద్దాలను ఉంచడానికి ఎల్లప్పుడూ ఉత్తర దిశను ఎంచుకోవడం మంచిది.

8. మబ్బుగా, మసకగా ఉన్న అద్దంలో ముఖాన్ని ఎప్పుడూ చూసుకోవద్దు.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, ప్రజల నమ్మకాల ఆధారంగా ఉంటుంది. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.