AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shirdi Sai Baba: సాయిబాబా అద్భుత నివాసం.. ఈ క్షేత్రంలో అడుగు పెట్టగానే అన్ని కష్టాలు తీరిపోతాయని విశ్వాసం..

సాయిబాబా తన జీవితమంతా ఫకీరుగా.. ప్రజా సంక్షేమం కోసం తన జీవితాన్ని గడిపారు. భక్తుల దుఃఖాలను, కష్టలను తీర్చే కలియుగ దైవంగా ఖ్యాతిగాంచారు. నేడు బాబా భౌతికంగా లేకపోయినా.. ఆయన సమాధి నుంచి భక్తులను కాపాడుతున్నారు. నేటికీ షిర్డీ సాయిబాబా తన మహిమను చూపిస్తున్నాడని విశ్వాసం.   

Shirdi Sai Baba: సాయిబాబా అద్భుత నివాసం.. ఈ క్షేత్రంలో అడుగు పెట్టగానే అన్ని కష్టాలు తీరిపోతాయని విశ్వాసం..
Shirdi Sai Baba Temple
Surya Kala
|

Updated on: May 25, 2023 | 12:06 PM

Share

భారత దేశంలోని ఒక పవిత్ర పుణ్యక్షేత్రం షిర్డీ.. ఇక్కడ కొలువైన సాయిబాబా భక్తులతో పూజలను అందుకుంటున్నాడుల్. తమకు ఎటువంటి కష్టం, దుఃఖం ఎదురైనా సాయిని ఆశ్రయిస్తూ.. షిర్డీకి చేరుకుంటారు. షిర్డీలో సాయిబాబా దర్శనం చేసుకున్న తర్వాత తమ బాధలు తొలగిపోతాయని విశ్వాసం. బాబా దర్శనం కోసం ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు షిర్డీకి చేరుకుంటారు. సాయిబాబా తన జీవితమంతా ఫకీరుగా.. ప్రజా సంక్షేమం కోసం తన జీవితాన్ని గడిపారు. భక్తుల దుఃఖాలను, కష్టలను తీర్చే కలియుగ దైవంగా ఖ్యాతిగాంచారు. నేడు బాబా భౌతికంగా లేకపోయినా.. ఆయన సమాధి నుంచి భక్తులను కాపాడుతున్నారు. నేటికీ షిర్డీ సాయిబాబా తన మహిమను చూపిస్తున్నాడని విశ్వాసం.

సాయిబాబాను భక్తులు భగవంతుని స్వరూపంగా భావిస్తారు. అయితే సాయిబాబాను కొందరు హిందువుగా, మరికొందరు ముస్లింగా భావించి పూజిస్తూ ఉంటారు. అయితే అన్ని మతాల వారికి సాయిబాబాపై విశ్వాసం ఉండడానికి ఇదే కారణం. అయితే సాయిబాబా పుట్టుక గురించి ఇప్పటి వరకు ఖచ్చితమైన సమాచారం వెల్లడి కాలేదు. అయితే సాయి బాబా జన్మించింది మహారాష్ట్రలోని షిర్డీ గ్రామంలో అని చెబుతారు. ఇప్పుడు షిర్డీలో బాబా కోసం  గొప్ప ఆలయం నిర్మించారు. ఈరోజు బాబా దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటారు.

షిరిడీలో పవిత్ర ధుని షిర్డీమ్‌లో సాయిబాబా ధుని నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఎవరైనా తమకు ఇబ్బందులు ఉంటె బాబా  ధునిలో కర్పూరం, చందనం వంటి వాటిని వేయవడం వలన కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. అందుకే సాయిబాబా ధునిని చాలా పవిత్రంగా భావిస్తారు. 1858లో షిరిడీకి వచ్చిన బాబా ఆ సమయంలో ఒక మసీదులో నివసించారు. ఇప్పుడు సాయి బాబా కొలువైన ఆలయానికి ద్వారకా మాయిగా పేరు. అప్పటి నుంచి అక్కడ ధుని వెలుగుతుంది. ఇది చాలా అద్భుతంగా పరిగణించబడుతుంది. భక్తులు తమతో పాటు ధుని నుంచి విభూతిని తీసుకుని వెళ్తారు.

ఇవి కూడా చదవండి

 వేప చెట్టు షిర్డీ  లో మరొక అద్భుతం వేప చెట్టు. ఈ చెట్టు కింద సాయిబాబా కూర్చునేవారు. బాబా అద్భుతం వల్ల వేప ఆకులోని చేదు మాయం అయి తీపిగా మారాయి. షిర్డీకి చేరుకున్న భక్తులు ఈ చెట్టు ఆకులను పొందడానికి చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే, ఇప్పుడు ఈ చెట్టుకు ఎటువంటి హాని జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.

‘అందరి దేవుడు ఒక్కడే’ షిర్డీ సాయి బాబా ఆలయం ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఆలయంలోని పెద్ద హాలులో సాయిబాబా సమాధిని నిర్మించారు. ఈ ప్రదేశంలో సాయిబాబా దేహాన్ని విడిచిపెట్టి సమాధి అయ్యారని విశ్వాసం. ఎవరైనా బాబా సమాధిని దర్శించుకుంటే, బాబా అతని జీవితంలో  సంతోషాన్ని నింపుతారు. గురువారం పల్లకిలో ఊరేగే సాయిబాబాను దర్శించుకుంటే ఆగిపోయిన పనులు కూడా జరుగుతాయని విశ్వాసం. సబ్ కా మాలిక్ ఏక్ హై.. అంటే ‘అందరికీ ఒకరే యజమాని’ అన్నది సాయిబాబా సందేశం.

బాబాకి ఐదు సార్లు హారతి  ఏ భక్తుడైనా కోరికతో సాయిబాబా ఆస్థానానికి చేరుకుంటే.. వారి ప్రతి కోరికను నెరవేరుస్తారని..  అతని జీవితంలో ఆనందం నింపుతారని నమ్ముతారు. సాయి సన్నిధిలో బాబాకు హారతి రోజుకు 5 సార్లు నిర్వహిస్తారు, అవి భూపాలి, కాకర, మధ్యాహ్న, సాయంత్రం, రాత్రి ఇలా ఐదు సార్లు హారతినిస్తారు. అయితే షిర్డీ సాయిబాబా దర్శనానికి గురువారం చేసుకోవడానికి భక్తులు ఆసక్తిని చూపిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

 

బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..