- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti by which men can easily impress women in telugu
Chanakya Niti: ఈ లక్షణాలున్న పురుషులను స్త్రీలు అమితంగా ఇష్టపడతారన్న ఆచార్య చాణక్య..
ప్రస్తుత తరం కూడా చాణక్యుడి విధానాలను అవలంబించడం ద్వారా తన జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. తన జీవితంలో చాణుక్యుడు చెప్పిన విధానాలను అవలంబిస్తే, జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని సులభంగా అధిగమించి జీవితానికి సంబంధించిన అన్ని ఆనందాలను పొందగలడు.
Updated on: May 23, 2023 | 1:31 PM

చదువుకు దూరమయ్యారు: పిల్లల చదువులపై శ్రద్ధ చూపని తల్లిదండ్రులు వారికి శత్రువుల వంటివారని ఆచార్య చాణక్యుడు అన్నారు. అలాంటి పిల్లలు పండితులకు మాత్రమే కాదు సహచర విద్యార్థులకు జోక్ గా మారతారు. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహించడం తల్లిదండ్రుల కర్తవ్యం.

తాదాత్మ్యం, అవగాహన: జీవిత భాగస్వామి భావాలను, అనుభవాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా భార్యాభర్తల మధ్య అవగాహనను పెంపొందించుకోండి. సవాలు ఎదురైతే జీవిత భాగస్వామి మద్దతుగా నిలబడండి. ఇది బంధాన్ని బలపరుస్తుంది. అవగాహన కూడా పెరుగుతుంది.

సహనం, క్షమాపణ: వివాహ బంధంలో సహనం, క్షమాపణ గుణం అతిముఖ్యం. ఈ గుణాలు ఎటువంటి భార్యాభర్తల మధ్య సంబంధాలను కూడా మెరుగుపరిచే గొప్ప గుణం. జీవిత భాగస్వామిలోని లోపాలను ఎత్తిచూపకుండా.. ఓపికపట్టండి .. తప్పు జరిగినప్పుడు క్షమించండి. మనోవేదనలను విడిచి పెట్టండి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య సంబంధం బలపడుతుంది.

కోపంతో ఉండే స్త్రీలు: ఆచార్య చాణక్యుడు స్త్రీలకు కోపం ఎక్కువ అని చెప్పారు. ఆమెకు ఎప్పుడు కోపం వస్తుందో ఎవరికీ తెలియదు. ఈ కారణంగా ఆమె తన భర్తతో ఎప్పుడు తగవు పడుతూ ఉంటుంది. దాంపత్య జీవితం అసంతృప్తితో సాగిపోతూ ఉంటుంది.

విధి నిర్వహణ: తల్లిదండ్రులు తమ కర్తవ్యాన్ని వీడి వెనక్కివెళ్లకూడదని చాణక్య నీతి చెబుతోంది. పిల్లల పెంపకంలో పూర్తి బాధ్యత తీసుకోవాలి. అలా చేయని తల్లిదండ్రులు, వారి పిల్లలు కూడా తమ కర్తవ్యానికి దూరమవుతారు.





























