- Telugu News Photo Gallery Shani Vakri 17 June, 2023 Bring Good Luck for These Zodiac Signs Know more details here
Shani Dev: ‘శని’ తిరోగమనం.. ఈ 5 రాశుల వారికి అదృష్ట దేవత తలుపు తట్టే ఛాన్స్..!
Shani Vakri 2023: శని గ్రహం తన స్వరాశి కుంభరాశిలోకి ప్రవేశించనుంది. జూన్ 17న శని కుంభరాశిలోకి తిరుగోమస్తాడు. ఈ ప్రభావం ఆయా రాశులపై ఉంటుంది. ముఖ్యంగా 5 రాశుల వారికి అంతా శుభం జరుగుతంది. ధన లాభంతో పాటు, అదృష్టం వరించే అవకాశం ఉంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Updated on: May 23, 2023 | 8:59 AM

Shani Vakri 2023: శని గ్రహం తన స్వరాశి కుంభరాశిలోకి ప్రవేశించనుంది. జూన్ 17న శని కుంభరాశిలోకి తిరుగోమస్తాడు. ఈ ప్రభావం ఆయా రాశులపై ఉంటుంది. ముఖ్యంగా 5 రాశుల వారికి అంతా శుభం జరుగుతంది. ధన లాభంతో పాటు, అదృష్టం వరించే అవకాశం ఉంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సింహ రాశి: శని తిరోగమనం సింహ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. సింహ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఆగిపోయిన పనులు మళ్లీ ఊపందుకోవడం ప్రారంభిస్తాయి. వ్యాపారుల ఒప్పందాలు ఫైనల్ కావచ్చు.

మకరం: శని తిరోగమనం వలన మకరరాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. వారి ఆర్థిక స్థితి మెరుగవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆస్తికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

మిథునరాశి: శనిదేవుని అనుగ్రహంతో చాలా కాలంగా నిలిచిపోయిన పని పూర్తి అవుతుంది. మీరు విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లయితే.. ఇందులో విజయం సాధిస్తారు. ఆర్థికంగా, ఈ ప్రయాణం అనుకూతలను చూపుతుంది. ఇది దీర్ఘకాలంలో మీకు ధన లాభాలను ఇస్తుంది.

మేషం: మేష రాశి వారికి శని తిరోగమనం వలన మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆస్తి పెరుగుదలకు బలమైన అవకాశం ఉంది. ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. సమస్యలు తగ్గుతాయి. ధనలాభం కలుగుతుంది. వ్యాపారం చేసే వ్యక్తులు మళ్లీ కొత్త వ్యాపారం చేపట్టే అవకాశం ఉంటుంది. ఇందులో వారు విజయం సాధిస్తారు.

వృషభం: శని తిరోగమనం కారణంగా, శుభ యోగ కేంద్ర త్రికోణ రాజ్ యోగం ఏర్పడబోతోంది. దీని వల్ల వృషభ రాశి వారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. కార్యాలయంలో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. మీ పని కారణంగా అధికారులు సైతం సంతోషంగా ఉంటారు.




