- Telugu News Photo Gallery Spiritual photos Lord Hanuman Seven Famous temples where new miracles happen every day full details here
Lord Hanuman Temples: ప్రతి రోజు ఈ ఆలయాల్లో అద్భుతాలే.. దేశంలో ఏడు ప్రసిద్ధ దేవాలయాలు
పవన తనయుడు రామ భక్త హనుమంతుని మహిమ అపరిమితం. బజరంగబలి ఆశీర్వాదం లభిస్తే చాలు తమ కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. భయం తమని బాధించదు, దయ్యాలు, పిశాచాలు తమ దగ్గరకు రావు అని నమ్మకం. హనుమంతుడి ఆశీర్వాదం పొందడానికి భక్తులు ప్రతి మంగళవారం ఉపవాసం ఉంటారు. ఆలయానికి వెళ్లి బజరంగబలిని పూజిస్తారు. బూందీ లడ్డూలను సమర్పిస్తారు. దేశంలో ఆంజనేయస్వామి ఆలయం లేని గ్రామం ఉండదు అంటే అతిశయోక్తి కాదు. అనేక ప్రసిద్ధ హనుమంతుడి దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లో భక్తులు ఏడాది పొడవునా దర్శనం చేసుకుంటానికి ఆసక్తిని చూపిస్తారు. ఈ రోజు దేశంలో ప్రసిద్ధ హనుమంతుడి ఏడు దేవాలయాల గురించి తెలుసుకుందాం..
Updated on: May 23, 2023 | 9:07 AM

వీర హనుమంతుడి దేవాలయం మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఉంది. ఈ ఆలయం 500 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు తెలుస్తుంది. రాజ్‌గఢ్‌లోని ఖిల్చిపూర్ పట్టణంలో ఉన్న ఈ ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా పరిగణిస్తారు. ఇక్కడ హనుమంతుడిని దర్శించుకుంటే చాలు తమ బాధలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. విశేషమేమిటంటే గత 31 ఏళ్లుగా ఈ ఆలయంలో జ్వాలా దీపం వెలుగుతూనే ఉంది. సమాచారం ప్రకారం.. ఉగ్రసేన మహారాజు హనుమంతుడిని ప్రతిష్టించడానికి ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది.

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఉన్న మెహందీపూర్ బాలాజీ ఆలయం ఒక అద్భుతం. ఈ ఆలయంలో హనుమంతుడు చిన్నపిల్ల రూపంలో కూర్చుని భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. ఇక్కడ హనుమంతుడు స్వయంగా వెలసినట్లు స్థలపురాణం. ఈ ఆలయానికి రాజస్థాన్‌లోనే కాదు దేశం మొత్తం గుర్తింపు ఉంది. దెయ్యం, పిశాచాలు వంటి వాటితో బాధపడే భక్తులు కేవలం ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడం ద్వారానే కోలుకుంటారు. భారీ సంఖ్యలో హనుమంతుడి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. ఈ ఆలయంలో వీర హనుమంతునితో పాటు భైరవుడు, శివుడు కూడా పూజలను అందుకుంటున్నారు. ఇక్కడ ఇచ్చే ప్రసాదాన్ని తినకూడదని అంటారు. అదేవిధంగా పూజ చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదని చెబుతారు. పూజానంతరం ఇక్కడ భక్తులు తమ బాధలను తెలియజేస్తూ.. భగవంతుని పాదాల వద్ద మోకరిల్లుతారు.


రాజస్థాన్‌లోని చురు జిల్లాలోని సలాసర్ పట్టణంలో సుజన్‌ఘర్ సమీపంలో ఉంది. ఈ ఆలయంలోని హనుమంతుడు మహిమ గలవాడు అని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో బాలాజీ గడ్డం, మీసాలతో ఉంటాడు. బంగారంతో చేసిన సింహాసనంపై కూర్చుని భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న హనుమంతుడుని దర్శించుకున్న ఏ భక్తుడైనా ఖాళీ చేతులతో తిరిగి రాడని నమ్మకం.

ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగం ఒడ్డున 20 అడుగుల పొడవున్న హనుమంతుడి ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ హనుమంతుడిని దర్శించిన భక్తుడి బాధలు, కష్టాలు దూరమవుతాయి. హనుమంతుడు ఆలయంలో సుందరా కాండను పారాయణం చేసే భక్తులపై పడుకుని తన ప్రత్యేక ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మంగళవారం తెల్లవారుజాము నుంచే ఆలయానికి భారీగా భక్తులు చేరుకుంటున్నారు. ఈ ఆలయానికి వెళ్లి సుందరకాండను పఠించే భక్తులు 21 సార్లు సుందరాకాండకు పఠించడం వలన విశిష్టమైన మేలు జరుగుతుందని విశ్వాసం. ఇక్కడ 21 సార్లు సుందరకాండను పఠించిన భక్తులకు వారి బాధలు తొలగిపోతాయి, బజరంగబలి వారిపై ప్రత్యేక అనుగ్రహాలను కురిపిస్తాడని విశ్వాసం.

వారణాసిలోని సంకట మోచన్ హనుమాన్ దేవాలయం కూడా దేశంలో ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని గోస్వామి తులసీదాస్ జీ స్థాపించారని చెబుతారు. ఈ ఆలయంలో బజరంగబలి దర్శనం చేసుకున్న భంగిమలోనే కూర్చుని ఉంటాడు. ఈ ఆలయంలో హనుమంతుడికి దేశీ నెయ్యితో చేసిన లడ్డూలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఆలయంలో బజరంగబలి విగ్రహం తన ప్రభువు శ్రీరాముని వైపు చూస్తున్నట్లుగా ఉంటుంది. ఈ ప్రదేశంలో హనుమంతుడు తులసీదాస్‌కు దర్శనమిచ్చాడని.. అందుకనే ఇక్కడ తులసీదాస్ ఆలయం నిర్మించాడని నమ్మకం. ఇక్కడ ఆలయంలోని హనుమంతుడి దర్శనం కోసం మంగళ, శనివారాల్లో భారీ సంఖ్యలో భక్తులు సంకట మోచన్ హనుమాన్ దేవాలయానికి చేరుకుంటారు.

గుజరాత్‌లోని సారంగపూర్‌లోని కష్టభంజన్ హనుమాన్ దేవాలయం అద్భుతమైన ఆలయంగా ప్రసిద్ధి. ఇక్కడ స్వామివారిని భక్తులు దాదా అని పిలుస్తారు. ఈ సిద్ధ ఆలయానికి దాదా దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు. ఇక్కడ హనుమంతుని దర్శనం చేసుకున్న భక్తులపై శనీశ్వరుడు అనుగ్రహం, ఆశీర్వాదాలను ఇస్తాడని విశ్వాసం. హనుమంతుడు ఈ ఆలయంలో బంగారు సింహాసనంపై కూర్చుని ఉంటాడు. దూరప్రాంతాల నుండి వచ్చి భక్తులు దర్శించుకుంటారు. ఇక్కడ హనుమంతుడి కాలు కిందశనీశ్వరుడు ఉంటాడు. అది కూడా ఒక స్త్రీ రూపంలో.. అందుకనే ఈ దేవాలయం చాలా ప్రత్యేకమైనదని చెబుతారు.




