- Telugu News Photo Gallery Invisible House: See Amazing Pics of Invisible House in Joshua Tree Downtown
The Invisible House: ది ఇన్విజిబుల్ హౌస్.. అక్కడే ఉంటుంది కానీ అస్సలు కనిపించదు..!
Invisible House Joshua Tree: ఈ ఇంటికి కొండ గుట్టల మధ్యన.. పూర్తిగా అద్దాలతో ల్యాండ్ స్కేప్‌లో నిర్మించారు. దీని ప్రత్యేక ఏంటంటే.. ఇది ఎవరికీ కనిపించదు. అక్కడ ఇల్లు ఉన్నట్లు ఎవరూ గుర్తించలేరు. అందుకే.. దీనికి ఇన్విజిబుల్ హౌజ్ అని పేరు పెట్టారు.
Updated on: May 23, 2023 | 7:59 AM

మనం ఈ ప్రపంచంలో ఎన్నో విలాసవంతమైన ఇళ్లను చూసి ఉంటాం. రాజభవనాల వైభవం నుంచి ఆకాశహార్మ్యాల వరకు రకరకాల భవనాలు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. కానీ, ఎవరికీ కనిపించని విధంగా డిజైన్ చేసిన ఇల్లు ఉందని మీకు తెలుసా? పోనీ దాని గురించి కనీసం విన్నారా?

అలాంటి ఇంటి గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఈ ఇంటిని అద్దాల సహాయంతో ల్యాండ్ స్కేప్‌లో పూర్తిగా ప్రకృతిలో కలిసిపోయినట్లుగా ఉండేలా డిజైన్ చేశారు. అందుకే ఈ ఇంటికి ‘ది ఇన్విజిబుల్ హౌస్’ అని పేరు పెట్టారు.

అయితే, ఈ ఇంటిని ప్రస్తుతం airbnb వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టారు. దీని ధర 18 మిలియన్ల డాలర్లుగా నిర్ణయించారు. అంటే మన కరెన్సీలో రూ. 150 కోట్లు. ఈ మొత్తం చెల్లిస్తే.. ఆ మ్యాజిక్ హౌస్‌ను సొంతం చేసుకోవచ్చు.

ఈ ఇల్లు అమెరికాలోని జాషువా ట్రీ డౌన్‌టౌన్‌లో నిర్మించారు. ఇది Airbnb వెబ్‌సైట్‌లో అత్యధిక ధరకు లిస్ట్ చేయడం జరిగింది.

పూర్తి అద్దాలతో నిర్మించిన ఈ ఆధునిక ఇల్లు 67.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది 5,500 చదరపు అడుగుల నివాస స్థలాన్ని కలిగి ఉంది. ఈ ఇల్లు జాషువా ట్రీ నేషనల్ పార్క్ సమీపంలో ఉంది.

ఇంటిలో 3 బెడ్‌రూమ్‌లు, 4 బాత్‌రూమ్‌లు, 100-అడుగుల ఇండోర్ పూల్‌తో సహా అనేక విలాసవంతమైన సౌకర్యాలను ఉన్నాయి.

ఈ ఇంటిని నిర్మించేటప్పుడు పర్యావరణాన్ని కూడా జాగ్రత్తగా చూసుకున్నారు. ఇన్విజిబుల్ హైజ్ పైకప్పు సౌర వ్యవస్థతో ఏర్పాటు చేశారు. దీని పైకప్పుపై సౌర ఫలకాలను అమర్చారు. ఇది ఇంటి అవసరాలకు సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంటిని చిత్ర నిర్మాత క్రిస్ హాన్లీ డిజైన్ చేశారు. ఇతనే దానికి ప్రస్తుత యజమాని కూడా. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ ఇల్లు హాన్లీకి డబ్బు సంపాదించి పెడుతోంది. అదెలాంగే.. ఈ ఇంటిని చూసేందుకు, ఫొటోలు తీయడానికి దూరప్రాంతాల నుంచి జనం వస్తుంటారు. అయితే, వారి ఈ ఇంటిని చూడటానికి, ఫోటోలు దిగడానికి ఛార్జెస్ వసూలు చేస్తుంటారు హాన్లీ.




