IPL 2023, RCB: ధనాధన్ లీగ్ 16వ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఆర్‌సీబీ ప్లేయర్లు.. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే..?

ఐపీఎల్ 16వ సీజన్‌లో ఆర్‌సీబీ తరఫున మొత్తం 21 ప్లేయర్లు ఆడగా.. మరో ఆరుగురు మాత్రం బెంచ్‌కే పరిమితమయ్యారు.

|

Updated on: May 23, 2023 | 6:44 AM

IPL 2023: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ ఐపీఎల్ 16వ సీజన్‌ ప్లేఆఫ్స్ రేసు నుంది వైదొలగింది. ఆడిన 14 మ్యాచ్‌లలో 7 మ్యాచ్‌లు మాత్రమే గెలిచిన ఆర్‌సీబీ పాయింట్ల టేబుల్‌లో 6వ స్థానంలోనే ఉంది. ఆర్‌సీబీ ఆడిన చివరి మ్యాచ్‌ గెలిచినా ప్లేఆఫ్స్‌కి వెళ్లే అవకాశం ఉంది, కానీ అందులో ‘ప్లే బోల్డ్’ టీమ్ అనూహ్య ఓటమిని చవిచూసింది.

1 / 9
అయితే ఆర్‌సీబీ ఆడిన ఈ 14 మ్యాచ్‌ల్లో ఆ టీమ్ తరఫున మొత్తం 21 మంది ఆటగాళ్లు మైదానంలో అడుగుపెట్టారు. కానీ మరోవైపు మొత్తం టోర్నీలో 6 మంది ఆటగాళ్లు బెంచ్‌లోనే ఉన్నారు. అంటే ఈ ఆరుగురు ఆటగాళ్లు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు.

2 / 9
ఇంకా ఆ ఆరుగురు ఆటగాళ్లలో ఐదుగురు ఆటగాళ్లు ఐపీఎల్ అరంగేట్రం కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఈ ఐపీఎల్‌లో RCB తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఆ ఆరుగురు ఆటగాళ్లు ఎవరో చూద్దాం..

3 / 9
1. సిద్ధార్థ్ కౌల్(బౌలర్): గత సీజన్‌లో RCB తరపున 1 మ్యాచ్ ఆడిన సిద్ధార్థ్ కౌల్ ఈసారి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

4 / 9
2. సోను యాదవ్(ఆల్ రౌండర్): ఈ సీజన్ కోసం సోను యాదవ్‌ని రూ. 20 లక్షలు చెల్లించి మరి కొనుగోలు చేసింది. కానీ అతను ఒక్క మ్యాచ్‌లోనూ ఆర్‌సీబీ తరఫున మైదానంలో అడుగు పెట్టలేదు.

5 / 9
3. అవినాష్ సింగ్(బౌలర్): రూ.60 లక్షలకు ఆర్సీబీ కొనుగోలు చేసిన అవినాష్ సింగ్‌కు కూడా ఈ సీజన్‌లో అవకాశం ఇవ్వలేదు.

6 / 9
4. మనోజ్ భాండాగే(ఆల్ రౌండర్): ఆర్‌సీబీ జట్టులో భాగమైన మనోజ్ భాండాగేకు కూడా ఒక్క మ్యాచ్‌లో అనుమతి లభించలేదు.

7 / 9
5. రాజన్ కుమార్(బౌలర్): రూ.70 లక్షలకు ఆర్‌సీబీ కొనుగోలు చేసిన రాజన్ కుమార్ కూడా ఐపీఎల్ 2023 టోర్నీ మొత్తం బెంచ్‌కే పరిమితమయ్యాడు.

8 / 9
6. ఫిన్ అలెన్ (బ్యాట్స్‌మన్): 2021 నుంచి RCB జట్టులో ఉన్న యంగ్ బ్యాట్స్‌మ్యాన్ ఈ సీజన్‌లో కూడా ఆరంగేట్రం కోసం ఎదురు చూస్తూనే గడిపాడు. గత 3 సంవత్సరాలుగా ఆర్‌సీబీ జట్టులోనే ఉన్నప్పటికీ అలెన్‌కు ఒక్క అవకాశం కూడా ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

9 / 9
Follow us