- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Niti Never Do These Mistakes in Life You Will Loss Everything Know More Details
Chanakya Niti: విజయాన్ని అడ్డుకునే దుష్టశక్తులివే.. వెంటనే వదిలించుకోండి.. లేదంటే లైఫ్ అంతా ఏడుపే..!
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చెప్పాడు. వాటిని అనుసరించడం ద్వారా వ్యక్తి తన జీవితాన్ని సక్సెస్‌ఫుల్‌గా, హ్యాపీగా రాణిస్తారు. అయితే, వ్యక్తి విజయాన్ని అడ్డుకునే కొన్ని తప్పులు, దురలవాట్లు ఉన్నాయి. వాటిని త్యజిస్తే జీవితంలో తప్పక సక్సెస్ సాధిస్తారు. మరి ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: May 24, 2023 | 6:55 AM

ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చెప్పాడు. వాటిని అనుసరించడం ద్వారా వ్యక్తి తన జీవితాన్ని సక్సెస్‌ఫుల్‌గా, హ్యాపీగా రాణిస్తారు. అయితే, వ్యక్తి విజయాన్ని అడ్డుకునే కొన్ని తప్పులు, దురలవాట్లు ఉన్నాయి. వాటిని త్యజిస్తే జీవితంలో తప్పక సక్సెస్ సాధిస్తారు. మరి ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సమయం విలువ: సమయానికి విలువ ఇవ్వని వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు. ఆచార్య చాణక్యుడు ప్రకారం, వివేకవంతమైన వ్యక్తి సమయాన్ని గౌరవస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే.. ఆ సమయమే మీకు సక్సె్స్ అందిస్తుంది.

డబ్బు విలువ: డబ్బును పట్టించుకోని, ఆలోచించకుండా ఖర్చు చేసే వారిపై లక్ష్మీ దేవి ఆగ్రహంగా ఉంటుంది. తద్వారా వారు పేదరికంలో మగ్గుతుంటారు. అందుకే మనిషి ఎప్పుడూ డబ్బు విలువను అర్థం చేసుకుని మసులుకోవాలి.

పరిస్థితులకు తగ్గట్టు: వేసవి అయినా, చలికాలమైనా గాడిద ప్రతి సీజన్‌లోనూ దృఢంగా ఉంటూ తన పనిని పూర్తి చేసుకుంటుందని ఆచార్య చాణక్యుడు చెప్పారు. అదే విధంగా మానవులు ఎప్పుడూ ఎటువంటి పరిస్థితులు ఎదురైనా భయాందోళనలకు గురికాకూడదని .. ధైర్యాన్ని కోల్పోకూడదని పేర్కొన్నాడు.

స్త్రీలను, పెద్దలను అవమానించడం: ఎవరైనా సరే స్త్రీలను, పెద్దలను అవమానించకూడదు. ఇతరులను గౌరవించని వారి వద్ద లక్ష్మీదేవి నిలువదు.