Jagannath Rath Yatra: ఈ ఏడాది పూరి జగన్నాథుని రథయాత్ర ప్రారంభ తేదీ, ప్రాముఖ్యత.. పూర్తి వివరాలు

. దేశంలో జరిగే గొప్ప ఉత్సవాల్లో ఒకటి పురీ జగన్నాథుడి రథయాత్రలో పాల్గొనేందుకు జగన్నాథుడిని, బలభద్రుడిని, సుభద్ర దేవిని దర్శించుకోవడానికి మన దేశం నుంచి మాత్రమే కాదు ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు చేరుకుంటారు. ఈ సంవత్సరం పూరీలో జరిగే ఈ మహా రథయాత్ర ఉత్సవం ఎప్పుడు జరుగుతుందో, అందులో పాల్గొనడం వల్ల కలిగే పుణ్యమేమిటో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Jagannath Rath Yatra: ఈ ఏడాది పూరి జగన్నాథుని రథయాత్ర ప్రారంభ తేదీ, ప్రాముఖ్యత.. పూర్తి వివరాలు
Jagannath Rath Yatra
Follow us

|

Updated on: May 25, 2023 | 8:13 AM

సనాతన హిందూ సంప్రదాయంలో జగన్నాథుని రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలోని రెండో రోజు జరుగుతుంది. ఈ పూరీ జగన్నాథుని రథయాత్ర లోక ప్రసిద్ధం ఆషాడమాసంలో  నిర్వహించే ఈ ఉత్సవాన్ని చూడడానికి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు. దేశంలో జరిగే గొప్ప ఉత్సవాల్లో ఒకటి పురీ జగన్నాథుడి రథయాత్రలో పాల్గొనేందుకు జగన్నాథుడిని, బలభద్రుడిని, సుభద్ర దేవిని దర్శించుకోవడానికి మన దేశం నుంచి మాత్రమే కాదు ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు చేరుకుంటారు. ఈ సంవత్సరం పూరీలో జరిగే ఈ మహా రథయాత్ర ఉత్సవం ఎప్పుడు జరుగుతుందో, అందులో పాల్గొనడం వల్ల కలిగే పుణ్యమేమిటో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రథయాత్ర 2023 తేదీ, సమయం జగన్నాథుని రథయాత్ర ఉత్సవం ఒడిశాలోని పూరీలో ఈ సంవత్సరం 20 జూన్ 2023న ప్రారంభమవుతుంది.  పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని రెండవ రోజు శుక్లపక్షం జూన్ 19, 2023 ఉదయం 11:25 గంటలకు ప్రారంభమవుతుంది. జూన్ 20, 2023 వరకు మధ్యాహ్నం 01:07 గంటలకు ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం జూన్ 20వ తేదీ వరకూ రథయాత్ర ఉత్సవం నిర్వహించనున్నారు.

రథయాత్ర ప్రాముఖ్యత హిందూమతంలో పురాతన నగరం పూరీ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇది చార్ ధామ్‌లలో ఒకటైన జగన్నాథుని నివాసం. ఈ క్షేత్రంలో కృష్ణుడు జగన్నాథుని రూపంలో కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో ప్రపంచం మొత్తానికి నాథుడైన జగన్నాథుడితో పాటు అతని అన్న బలభద్రుడు, సోదరి సుభద్ర మాత్రమే కాకుండా ఇతర దేవతలు కూడా ఉన్నారు. హిందూ విశ్వాసం ప్రకారం.. జగన్నాథుడు రథయాత్రలో పాల్గొన్న భక్తులకు ఏడాది పొడవునా తన ఆశీస్సులను అందజేస్తాడు. విశేషమేమిటంటే ఈ రథయాత్రలో భాగంగా జగన్నాథుడు సంవత్సరానికి ఒకసారి ప్రసిద్ధ గుండిచా మాత ఆలయాన్ని సందర్శిస్తాడు.

రథయాత్ర పౌరాణిక చరిత్ర పౌరాణిక నమ్మకం ప్రకారం.. ఒకసారి శ్రీకృష్ణుడి సోదరి సుభద్ర తన అన్నలైన కృష్ణ, బలరాంతో కలిసి నగరాన్ని సందర్శించాలని తన కోరికను వ్యక్తం చేసింది. ఆ తర్వాత సోదరులిద్దరూ తమ ప్రియమైన సోదరి సుభద్రతో కలిసి నగర పర్యటనకు బయలుదేరారు. నగర పర్యటనలో, జగన్నాథుడు తన అత్త గుండిచా ఇంటికి వెళ్లి అక్కడ 7 రోజులు విశ్రాంతి తీసుకొన్నాడట. నాటి నుండి నేటి వరకు భగవంతుని మహాయాత్ర సమయంలో జగన్నాథుడు, సుభద్ర, బలరాముడితో కలిసి ఇక్కడకు వేంచేస్తారు. వార్షిక రథయాత్రలో, శ్రీకృష్ణుని అన్న బలరాముని రథం ముందు భాగంలో ఉంటుంది, తర్వాత సుభద్రా దేవి రథం ఉంటుంది. ఈ పవిత్ర రథయాత్రలో జగన్నాథుని రథం వెనుక వైపు కదులుతుంది.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..