Kitchen Vatu Tips: వంటగది విషయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. కష్టాలపాలవుతారు..!
వ్యక్తి జీవితాన్ని సక్రమంగా నడపించడంలో వాస్తు కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో వంటగదిలో ప్రత్యేకంగా వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. వంటగది మన కడుపు నింపడమే కాకుండా సంతోషానికి, ఐశ్వర్యానికి ప్రతీక. అన్నపూర్ణ దేవి వంటగదిలో నివసిస్తుందని చెబుతారు. వంటగది దిశ సరిగ్గా ఉంటే.. ఆనందం, శ్రేయస్సు వస్తుంది. ఈ వంటగది పొరపాటున కూడా తప్పు దిశలో ఉంటే..

వ్యక్తి జీవితాన్ని సక్రమంగా నడపించడంలో వాస్తు కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో వంటగదిలో ప్రత్యేకంగా వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. వంటగది మన కడుపు నింపడమే కాకుండా సంతోషానికి, ఐశ్వర్యానికి ప్రతీక. అన్నపూర్ణ దేవి వంటగదిలో నివసిస్తుందని చెబుతారు. వంటగది దిశ సరిగ్గా ఉంటే.. ఆనందం, శ్రేయస్సు వస్తుంది. ఈ వంటగది పొరపాటున కూడా తప్పు దిశలో ఉంటే.. అది పేదరికానికి దారితీస్తుంది. వంటగది లోపల వస్తువులను కూడా తప్పుగా పెట్టవద్దు. అది కూడా మీ జీవతంపై ప్రభావం చూపుతుంది. అందుకే వంటగది నిర్మాణం, అందులో ఏర్పాటు చేసే వస్తువుల విషయంలోనూ వాస్తును సరిగ్గా పాటించాలి. వంటగదికి సంబంధించిన వాస్తు దోషాలు ఏంటి? ఏవి సమస్యలను కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
వంటగదిలో ఈ పని అస్సలు చేయొద్దు..
1. మంచి ఆరోగ్యం, ఆర్థిక పరిపుష్టి కలిగి ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే వంటగదిని ఎప్పుడూ ఆగ్నేయ దిశలో నిర్మించుకోవాలి.
2. స్టవ్ పొరపాటున కూడా డోర్ ముందు గానీ, పక్కన కానీ పెట్టకూడదు.




3. వంటగదిలో వంట చేసేటప్పుడు, పొరపాటున కూడా మీ ముఖాన్ని దక్షిణ దిశలో ఉంచవద్దు, అది హాని కలిగించవచ్చు.
4. కిచెన్‌లోని గ్యాస్ స్టవ్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. పొయ్యి మురికిగా ఉంటే.. అన్నపూర్ణ దేవికి ఆగ్రహం వస్తుంది.
5. ఇంటి కిచెన్‌ను మెట్ల కింద నిర్మించొద్దు. అలాగే, వంటగది బాత్రూమ్ పక్కన ఉండకూడదు. ఇది ఇంట్లో నివసించే వారిపై చెడు ప్రభావం చూపుతుంది.
6. వంటగదిలో వంట చేసిన తర్వాత పాత్రలను ఎల్లప్పుడూ కడగాలి. వాటిని మురికిగా ఉంచడం వాస్తు ప్రకారం అశుభం.
7. ఇంటి వంటగదిలో ఎప్పుడూ శబ్ధం వచ్చే రోలింగ్ పిన్‌ను ఉపయోగించకూడదు. దీంతో ఇంట్లో గొడవలు జరగడంతో పాటు ధన నష్టం కూడా జరుగుతోంది.
8. వంటగదిలో నలుపు వస్తువులను తక్కువగా ఉపయోగించాలి. వాస్తు ప్రకారం, నలుపు రంగు ప్రతికూల శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది.
9. చాలా ఇళ్లలో డస్ట్‌బిన్‌ను సింక్ కింద ఉంచుతారు. ఈ తప్పు అస్సలు చేయొద్దు. దీని వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ రావడం మొదలవుతుంది.
10. వంటగదిలో ఉంచిన రిఫ్రిజిరేటర్ దిశ ఉత్తరం, ఆగ్నేయం, పశ్చిమంగా ఉండాలి. రిఫ్రిజిరేటర్ తలుపు తూర్పు దిశలో మాత్రమే తెరవాలి.
11. వంటగదిలో చీపురు ఎప్పుడూ ఉంచకూడదు. ఇది ఇంట్లో నివసించే ప్రజల జీవితాల్లో సమస్యలను సృష్టిస్తుంది. అందుకే వెంటనే ఈ తప్పును సరిదిద్దుకోవాలి.
12. వంటగదిలో అద్దం అమర్చినట్లయితే వెంటనే తొలగించాలి. వంటగదిలో అద్దం ఉండటం అగ్ని ప్రతిబింబంగా మారుతుందని విశ్వాసం. దీని కారణంగా ఇంట్లో వారికి హానీ కలుగుతుంది.
గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, ప్రజల విశ్వాసాలపై ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..