Tirumala: తిరుమలలో ఆధునిక టెక్నాలజీతో హైలెవెల్ సెక్యూరిటీ.. హోం శాఖ ప్రధాన కార్యదర్శి కీలక నిర్ణయాలు
తిరుమల సెక్యూరిటీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వీఐపీల నుంచి సామాన్య భక్తుల వరకు భద్రతపరమైన లోటు పాట్లు లేకుండా చేస్తుంది. ముఖ్యంగా మారుతున్న అవసరాల మేరకు టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచంలోనే అత్యుత్తమ వింగ్‌ను తీసుకొచ్చేందుకు సెక్యూటీ కమిటి నిర్ణయం తీసుకుంది.

తిరుమల సెక్యూరిటీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వీఐపీల నుంచి సామాన్య భక్తుల వరకు భద్రతపరమైన లోటు పాట్లు లేకుండా చేస్తుంది. ముఖ్యంగా మారుతున్న అవసరాల మేరకు టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచంలోనే అత్యుత్తమ వింగ్‌ను తీసుకొచ్చేందుకు సెక్యూటీ కమిటి నిర్ణయం తీసుకుంది. తిరుమలలో భద్రతపరమైన మార్పులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రెండు రోజులుగా శ్రీవారి ఆలయం, క్యూలైన్లలో కమిటీ పరిశీలించింది. భద్రత కమిటీ ముఖ్య అధికారి హరీష్ కుమార్ గుప్తా నిన్న, ఇవాళ పలు ప్రాంతాల్లో పర్యటించి సమీక్ష చేశారు. టెక్నాలజిని ఉపయోగించి భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తామన్నారు. తిరుమలలో యాంటి డ్రోన్ సిస్టం ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తామన్నారు. ఏదీ చేసిన ఆగమ శాస్త్రానికి అనుగుణంగానే టెక్నాలజీని ఉపయోగించి.. ప్రపంచంలోనే అత్యుత్తమ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీశ్ కుమార్ గుప్తా. అన్నమయ్య భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తర్వాత టీటీడీ అధికారులతో కలిసి శ్రీవారి ఆలయం, మాడవీధులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, ఆర్టీసీ బస్ స్టేషన్లు, ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, వాటర్ పంపింగ్ హౌస్, నారాయణగిరి ఉద్యానవనం, క్యూలైన్లు, సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రాంతాలను పరిశీలించారు.
కాగా ఏడు విభాగాల నిపుణుల కమిటీ సభ్యులు 15 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఇప్పుడు అమలవుతున్న భద్రతాపరమైన అంశాలను పరిశీలించి, గతంలో భద్రత కమిటీ ఇచ్చిన సిఫార్సులను పరిశీలించి ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే గుర్తించాలని హరీశ్ కుమార్ గుప్తా ఆదేశించారు. తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అనుసంధానిస్తూ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, తనిఖీలు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు బాడీ స్కానర్స్‌ను ప్రతిపాదించినట్టు తెలిసింది.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..