బ్రూస్‌లీలా పోజులిస్తోన్నఈ కుర్రాడు టాలీవుడ్‌లో ఓ సెన్సేషన్‌.. తనకు నచ్చినట్టే బతుకుతాడు.. ఎవరో గుర్తుపట్టారా?

సినిమాలు చేసినా, చేయకపోయినా నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. నలుగురికి నచ్చినది తనకు అసలు నచ్చదంటాడు. మనసులో ఏదీ దాచుకోడు. మైండ్‌లో ఏది తోస్తే అది మాట్లాడతాడు. ఎదురుగా ఉన్నది ఎవరైనా సరే.. ముక్కు సూటిగా మాట్లాడతాడు. ఎందుకు ఇలా చేస్తావని అడిగితే అంతా ‘నాఇష్టం’ అంటాడు.

బ్రూస్‌లీలా పోజులిస్తోన్నఈ కుర్రాడు టాలీవుడ్‌లో ఓ సెన్సేషన్‌.. తనకు నచ్చినట్టే బతుకుతాడు.. ఎవరో గుర్తుపట్టారా?
Tollywood Celebrity
Follow us
Basha Shek

|

Updated on: May 23, 2023 | 5:52 PM

పై ఫొటోలో కరాటే ప్రాక్టీస్‌ చేస్తూ కనిపిస్తున్న కుర్రాడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ సంచలనం. అలా గనీ అతనేమి స్టార్‌ హీరో కాదు. యాక్టర్‌ కూడా కాదు. కానీ అంతకు మించిన సెన్సేషన్‌. సినిమాలు చేసినా, చేయకపోయినా నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. నలుగురికి నచ్చినది తనకు అసలు నచ్చదంటాడు. మనసులో ఏదీ దాచుకోడు. మైండ్‌లో ఏది తోస్తే అది మాట్లాడతాడు. ఎదురుగా ఉన్నది ఎవరైనా సరే.. ముక్కు సూటిగా మాట్లాడతాడు. ఎందుకు ఇలా చేస్తావని అడిగితే అంతా ‘నాఇష్టం’ అంటాడు. కేవలం సినిమాల పరంగానే కాదు ఇటీవల రాజకీయాల పరంగానూ ఫుల్‌ యాక్టివ్‌గా మారిపోయాడు. కొందరి పొలిటికల్‌ లీడర్లపై తన దైన శైలిలో సెటైర్లు వేస్తున్నాడు. తన ట్విట్టర్‌ పోస్టులతో సీనియర్‌ రాజకీయ నాయకులకు సైతం తలనొప్పిగా మారాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్‌. ఈ కరాటే కుర్రాడు మరెవరో కాదు.. సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. నాగార్జున ‘శివ’ సినిమాతో టాలీవుడ్‌లో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన ఆయన క్షణక్షణం, గాయం, మనీ, రంగీలా, దెయ్యం, అనగనగా ఒకరోజు, సత్య, కంపెనీ, సర్కార్‌, రక్త చరిత్ర, వీరప్పన్‌ తదితర సినిమాలతో స్టార్‌ డైరెక్టర్‌గా మారిపోయాడు. బాలీవుడ్‌లోనూ తన దైన మార్క్‌ చూపించాడు. అమితాబ్‌, ఆమిర్‌ ఖాన్‌, సంజయ్‌ దత్‌ వంటి స్టార్‌ హీరోలతో సినిమాలు చేసి విజయాలు అందుకున్నాడు.

అయితే ఇదంతా గత వైభవం. ఇప్పుడు హిట్‌ సినిమాలు తీయట్లేదు ఆర్జీవీ. కొందరి వ్యక్తుల జీవిత చరిత్రలను సినిమాలుగా తెరకెక్కిస్తున్నాడు కానీ విజయాలు దక్కడం లేదు. తరచూ కాంట్రవర్సీల చుట్టూ తిరుగుతుంటాడు. సినిమాలు లేకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ లపై సెటైర్లే వేస్తూ వార్తలో నిలుస్తున్నాడు. ట్విట్టర్‌లో ఫుల్‌ యాక్టివ్‌గా ఉండే ఆర్జీవీ అప్పుడప్పుడు తన చిన్ననాటి అరుదైన ఫొటోలు షేర్‌ చేస్తుంటాడు. పై ఫొటో కూడా అలాంటిదే. ఇది ఆర్జీవీ కాలేజ్‌ డేస్‌ నాటి ఫొటో. ఇందులో కరాటే ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించాడు వర్మ. అయితే బక్క పల్చగా ఉండడంతో అసలు గుర్తుపట్టలేకుండా ఉన్నాడు. మరి మీరు గుర్తుపట్టారా? లేదా?

ఇవి కూడా చదవండి

View this post on Instagram

A post shared by RGV (@rgvzoomin)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!