AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ponniyin Selvan 2 OTT: ఓటీటీలోకి పొన్నియన్‌ సెల్వన్‌ 2.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

దిగ్గజ దర్శకుడు మణి రత్నం తన కలల ప్రాజెక్టుగా రూపొందించిన చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌. మొత్తం రెండు భాగాలుగా తెరెక్కిన ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ సినిమాలో చియాన్ విక్రమ్, ఐశ్వర్య రాయ్, త్రిష, కార్తి, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ్ల, ప్రకాశ్‌రాజ్‌, శరత్‌కుమార్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

Ponniyin Selvan 2 OTT: ఓటీటీలోకి పొన్నియన్‌ సెల్వన్‌ 2.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Ponniyin Selvan 2
Basha Shek
|

Updated on: Jun 02, 2023 | 12:35 PM

Share

దిగ్గజ దర్శకుడు మణి రత్నం తన కలల ప్రాజెక్టుగా రూపొందించిన చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌. మొత్తం రెండు భాగాలుగా తెరెక్కిన ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ సినిమాలో చియాన్ విక్రమ్, ఐశ్వర్య రాయ్, త్రిష, కార్తి, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ్ల, ప్రకాశ్‌రాజ్‌, శరత్‌కుమార్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. పొన్నియనల్ సెల్వన్‌ పార్ట్‌ గతేడాది విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. సుమారు రూ. 600 కోట్ల వసూళ్ల వచ్చాయి. ఓటీటీలోనూ రికార్డు వ్యూస్‌ అందుకుంది. ఇక ఏప్రిల్‌ 28న మూవీ పార్ట్‌ 2 గ్రాండ్‌గా రిలీజైంది. మొదటి పార్ట్‌ కంటే సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిసింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద తమిళ చిత్రాలలో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. కాగా థియేటర్లలో సూపర్‌ హిట్‌గా నిలిచిన పొన్నియన్ సెల్వన్‌ 2 సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడీ నిరీక్షణకు తెరపడనుంది. పొన్నియన్ సెల్వన్ 2 డిజిటల్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్ ప్రైమ్ దాదాపు 120 కోట్లకు సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ కు రెడీ అయ్యింది.

పొన్నియన్ సెల్వన్2 మే 26 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే మొదట రెంటల్‌ సర్వీస్‌ ప్రాతిపదికన స్ట్రీమింగ్ కానుంది. ఇక జూన్‌ రెండో వారం నుంచి అమెజాన్ సబ్‌స్క్రైబర్లకు ఉచితంగా అందుబాటులోకి ఉండనుంది. పొన్నియిన్ సెల్వన్-2 లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఆస్కార్‌ అకాడమీ అవార్డు గెలుచుకున్న స్వరకర్త ఏఆర్‌ రెహమాన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో పొన్నియన్ సెల్వన్‌ 2 ను మిస్‌ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు