2000 Notes: కమెడియన్ వెన్నెల కిషోర్‌ ఇంట్లో కుప్పలు తెప్పలుగా 2000 నోట్ల కట్టలు.. ఫొటో తీసి షేర్‌ చేసిన హీరో

రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు శుక్రవారం (మే19) సాయంత్రం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సంచలన ప్రకటన చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. చాలామంది రూ.2 వేల నోట్లను మార్చుకునే పనిలో పడ్డారు. భారత ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

2000 Notes: కమెడియన్ వెన్నెల కిషోర్‌ ఇంట్లో కుప్పలు తెప్పలుగా 2000 నోట్ల కట్టలు.. ఫొటో తీసి షేర్‌ చేసిన హీరో
Vennela Kishore
Follow us
Basha Shek

|

Updated on: May 21, 2023 | 12:44 PM

రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు శుక్రవారం (మే19) సాయంత్రం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సంచలన ప్రకటన చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. చాలామంది రూ.2 వేల నోట్లను మార్చుకునే పనిలో పడ్డారు. భారత ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో రూ.2వేల నోటును ఉపసంహరించుకోవడంపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్‌ తెగ పుట్టుకొస్తున్నాయి. ఇవి నెటిజన్లను తెగ నవ్విస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్‌ కమెడియన్‌ వెన్నెల కిషోర్ గురించి సినీ హీరో మంచు విష్ణు చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘వెన్నెల కిషోర్ గారి ఇంటికి వెళ్లినప్పుడు ఈ కింది ఫొటో తీసుకొన్నాను. ఇప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. వెన్నెల కిషోర్ ఈ నోట్లను ఏం చేస్తాడో అనే ఫీలింగ్ కలుగుతుంది’ అని ట్వీట్‌ చేశాడు. ఈ ఫొటోలో 2000 వేల రూపాయల నోట్లు కుప్పలు తెప్పలుగా పోసి ఉన్నాయి. మంచు విష్ణు చేసిన ఫోటోపై… నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘మాకు ఓ నోట్ల కట్ట ఇవ్వు అన్నా’ అని కొందరంటే, ‘ఇన్ కం ట్యాక్స్ వాళ్లను పిలవాల్సిందే’ అని మరికొందరూ కామెంట్లు చేస్తున్నారు.

మంచు విష్ణు ట్వీట్‌పై వెన్నెల కిషోర్ కూడా స్పందించాడు.’ నా మీద పడతారేంటి’ అని రిప్లై ఇచ్చాడు. కాగా మంచు విష్ణు, వెన్నెల కిషోర్ మంచి స్నేహితులున్న సంగతి తెలిసిందే. గతంలోనూ వీరి మధ్య ఇలాంటి సరదా సన్నివేశాలు, సెటైర్లు, ట్వీట్లు ఉన్నాయి. ఈ క్రమంలో వెన్నెల కిషోర్‌ను ఆట పట్టించడానికే మంచు విష్ణు ఇలా ట్వీట్‌ చేశాడు. కాగా రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ.. సెప్టెంబర్ 30వ తేదీలోపు మాత్రమే ఈ పెద్ద నోటుకు విలువ ఉంటుందని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మంచు విష్ణు ట్వీట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?