Virupaksha: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రీసెంట్‌ బ్లాక్‌ బస్టర్‌.. సాయి ధరమ్‌ తేజ్‌ ‘విరూపాక్ష’ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోన్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడనుంది. విరూపాక్ష సినిమా డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది.  మరికొన్నిగంటల్లో ఓటీటీలోకి అడుగుపెట్టనుంది తేజ్‌ సినిమా.

Virupaksha: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రీసెంట్‌ బ్లాక్‌ బస్టర్‌.. సాయి ధరమ్‌ తేజ్‌ 'విరూపాక్ష' స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
అయితే ఈ సినిమాలో మెయిన్‌ విలన్‌గా యాంకర్‌ శ్యామలను మొదటగా అనుకున్నారట. అయితే సుకుమార్ సూచనల మేరకు కార్తీక్‌ దండు సంయుక్తను మెయిన్‌ విలన్‌గా మార్చారట.
Follow us
Basha Shek

|

Updated on: May 20, 2023 | 1:24 PM

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, లేటెస్ట్ సెన్సేషన్‌ సంయుక్త మీనన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం విరూపాక్ష. కొత్త దర్శకుడు కార్తీక్ దండు ఈ ఇంటెన్స్‌ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు. ఏప్రిల్ 21వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ హిట్‌ అందుకుంది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించి ఏకంగా రూ.100 కోట్ల క్లబ్‌ లిస్టులో చేరింది. థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోన్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడనుంది. విరూపాక్ష సినిమా డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది.  మరికొన్నిగంటల్లో ఓటీటీలోకి అడుగుపెట్టనుంది తేజ్‌ సినిమా. శనివారం (మే20) అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ ఇంటెన్స్‌ న్యాచురల్‌ థ్రిల్లర్‌ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. విరూపాక్ష సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. కాంతారా, విక్రాంత్ రోణ ఫేం అజనీశ్‌ లోక్‌నాథ్‌ అందించిన బీజీఎమ్‌, స్వరాలు విరూపాక్ష విజయంలో కీలక పాత్ర పోషించాయి.

కాగా తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన విరూపాక్ష సినిమాను ఇతర భాషల్లోనూ రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. హిందీ, త‌మిళ్‌, మ‌ల‌యాళ, కన్నడ భాష‌ల్లోనూ ఈ సినిమా రిలీజైంది. అక్కడ కూడా సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళుతోంది. ఈ సినిమాలో సునీల్‌, రాజీవ్‌ కనకాల, బ్రహ్మాజీ, రవి కృష్ణ, సోనియా, అభినవ్‌ గోమఠం, కమల్ కామరాజు, సాయి చంద్, అజయ్‌, చత్రఫతి శేఖర్, యాంకర్‌ శ్యామల తదితరలు ప్రధాన పాత్రల్లో నటించారు. మరి థియేటర్లలో విరూపాక్షను మిస్‌ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?