Shubman Gill: స్పైడర్‌ మ్యాన్‌లా మారిపోయిన శుభ్‌మాన్‌ గిల్‌.. కారుమీదకెక్కి పోజులు.. వీడియో వైరల్‌

శుభ్‌మాన్ గిల్‌.. ఐపీఎల్‌ 2023లో బాగా వినిపిస్తోన్న పేరు. గుజరాత్‌ జెయింట్స్‌ ఓపెనర్‌గా పరుగుల వర్షం కురిపిస్తోన్న గిల్‌ టీమిండియా ఫ్యూచర్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇటీవలే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మీద సెంచరీ చేసి ప్రస్తుతం ఫుల్‌ జోష్‌లో ఉన్నాడీ యంగ్‌ ప్లేయర్‌.

Shubman Gill: స్పైడర్‌ మ్యాన్‌లా మారిపోయిన శుభ్‌మాన్‌ గిల్‌.. కారుమీదకెక్కి పోజులు.. వీడియో వైరల్‌
Shubman Gill
Follow us
Basha Shek

|

Updated on: May 19, 2023 | 1:48 PM

శుభ్‌మాన్ గిల్‌.. ఐపీఎల్‌ 2023లో బాగా వినిపిస్తోన్న పేరు. గుజరాత్‌ జెయింట్స్‌ ఓపెనర్‌గా పరుగుల వర్షం కురిపిస్తోన్న గిల్‌ టీమిండియా ఫ్యూచర్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇటీవలే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మీద సెంచరీ చేసి ప్రస్తుతం ఫుల్‌ జోష్‌లో ఉన్నాడీ యంగ్‌ ప్లేయర్‌. తాజా సీజన్‌లో ఇప్పటివరకు 576 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన వారి లిస్టులో రెండో స్థానంలో ఉన్నాడు. కాగా అంచనాలకు మించి రాణిస్తుండడంతో గిల్‌ పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈక్రమంలో ఇటీవలే హాలీవుడ్‌ యానిమేషన్‌ మూవీ స్పైడర్ మ్యాన్ కి హిందీ వెర్షన్ డబ్బింగ్ చెప్పి ఆకట్టుకున్నాడు. తద్వారా హాలీవుడ్‌ ఫ్రాంఛైజీలకు చెందిన ఓ సినిమాలో ఓ పాత్రకు డబ్బింగ్‌ చెబుతున్న తొలి క్రీడాకారుడిగా శుభ్‌మాన్‌ రికార్డుల కెక్కాడు. తాజాగా ఇదే స్పైడర్‌ మ్యాన్‌ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో మరోసారి సందడి చేశాడీ యంగ్ క్రికెటర్‌. ఈ సందర్భంగా సూటు, బూటు ధరించి ఎంతో హ్యాండ్‌సమ్‌గా కనిపించిన శుభ్ మాన్ గిల్‌ స్పైడర్ మ్యాన్ తరహాలో కారు మీదకెక్కి కొన్ని ఫోజులు ఇచ్చాడు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా 2018లో వచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌ : ఇన్‌టు ది స్పైడర్‌-వెర్స్‌’ చిత్రానికి సీక్వెల్‌గా ‘స్పైడర్‌ మ్యాన్‌: అక్రాస్‌ ది స్పైడర్‌-వెర్స్‌’ను రూపొందించారు. భారత్‌లో ఈ సినిమాను సోనీ పిక్చర్‌ విడుదల చేస్తోంది. జూన్‌ 2న ఈ చిత్రం ఇంగ్లిష్‌తో సహా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ తదితర భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక శుభ్‌మాన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ కి చేరుకుంది. డిపెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆ జట్టు ఈసారి కూడా టైటిల్‌ వేటలో ముందంజలో ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో హార్దిక్ సేన అగ్రస్థానంలో ఉంది. ఇక ఆదివారం జరిగే మ్యాచ్‌లో గుజరాత్‌ బెంగళూరుతో తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే