Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmanandam: జబర్దస్త్ కమెడియన్‌కు ఇల్లు కొనిచ్చిన బ్రహ్మానందం.. వాస్తు చూసి చేతిలో డబ్బులు పెట్టి మరీ..

గతంలో ఏడాదికి కనీసం 20 సినిమాల్లో కనిపించే బ్రహ్మానందం, ఈమధ్య అడపాదడపా మాత్రమే వెండితెరపై కనిపిస్తున్నారు. అయితే స్క్రీన్‌పై కనిపించకపోయినా మీమ్స్‌, వాట్సప్‌ స్టేటస్‌, ఇన్‌ స్టా రీల్స్‌ రూపంలో అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నారాయన. ఇటీవలే రంగమార్తాండ సినిమాలో చక్రపాణిగా అందరితో కన్నీళ్లు పెట్టించిన బ్రహ్మానందం

Brahmanandam: జబర్దస్త్ కమెడియన్‌కు ఇల్లు కొనిచ్చిన బ్రహ్మానందం.. వాస్తు చూసి చేతిలో డబ్బులు పెట్టి మరీ..
Brahmanandam, Racha Ravi
Follow us
Basha Shek

|

Updated on: May 13, 2023 | 8:00 AM

బ్రహ్మానందం.. ఈ పేరు వింటనే చాలామంది పెదాలపై చిరు నవ్వు ప్రత్యక్షమవుతుంది. అంతలా తన నటనతో ప్రేక్షులను నవ్వించారాయన. 1000కి పైగా సినిమాల్లో నటించిన ఆయన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దిగ్గజ కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన అసమాన నటనతో గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లోకి సైతం ఎక్కారాయన. గతంలో ఏడాదికి కనీసం 20 సినిమాల్లో కనిపించే బ్రహ్మానందం, ఈమధ్య అడపాదడపా మాత్రమే వెండితెరపై కనిపిస్తున్నారు. అయితే స్క్రీన్‌పై కనిపించకపోయినా మీమ్స్‌, వాట్సప్‌ స్టేటస్‌, ఇన్‌ స్టా రీల్స్‌ రూపంలో అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నారాయన. ఇటీవలే రంగమార్తాండ సినిమాలో చక్రపాణిగా అందరితో కన్నీళ్లు పెట్టించిన బ్రహ్మానందం గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. తన తోటి కళాకారులకు, కమెడియన్లకు ఎప్పుడు అవసరమొచ్చినా ఆదుకునే బ్రహ్మానందం ఒక జబర్దస్త్‌ కమెడియన్‌కు స్వయంగా ఇల్లు కొనిచ్చారట. ఆ కమెడియన్‌ మరెవరో కాదు.. రచ్చ రవి. ఓ ఇంటర్వ్యూకు హాజరైన అతను హాస్యబ్రహ్మతో తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు.

‘.బ్రహ్మానందం గారు నన్ను సొంత తమ్ముడిలాగా చూసుకునేవారు. నా సినిమా కెరీర్ ప్రారంభం లో ఆయన నన్ను ఇల్లు కట్టుకోరా అని చాలా సార్లు చెప్పేవారు. కావాలంటే ఒక రూ.5 లక్షల సహాయం ఇస్తాను. వెంటనే ఇల్లు ప్రారంభించు అని అప్పట్లో రూ.5 లక్షలు ఇచ్చారు. అంతేకాదు స్వయంగా ఆయనే ఫ్లాట్‌ చూపించి ఇది కొనుక్కోరా బాగా కలిసివస్తుంది అని చెప్పారు. అప్పటికప్పుడు చేతిలో రూ. 5 లక్షలు పెట్టారు. అయన చెప్పినప్పుటి నుంచి నాకు అంతా కలిసి వచ్చింది. ఆ ఇంటికి మారాక నాకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఎన్నో అవార్డులు కూడా అందుకున్నా. నటుడిగా మంచి పేరు సంపాదించాను. ఆర్థికంగా కూడా బాగా స్థిరపడ్డాను. మా ఇంటి గృహప్రవేశానికి కూడా ఆయన వచ్చారు. మమ్మల్ని ఆశీర్వదించారు. ఆయన గొప్ప నటుడైనా ఎంతో సింపుల్‌గా ఉంటారు. మా కుటుంబం అందరితో కలిసి ఒక్కొక్కరితో ఆయన సెల్ఫీ కూడా దిగారు’ అని చెప్పుకొచ్చాడు రచ్చరవి.

ఇవి కూడా చదవండి

View this post on Instagram

A post shared by Racha Ravi (@meracharavi)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

కేఎల్ రాహుల్ వర్సెస్ సంజీవ్ గోయెంకా.. అందరిచూపు ఈ ఇద్దరిపైనే..
కేఎల్ రాహుల్ వర్సెస్ సంజీవ్ గోయెంకా.. అందరిచూపు ఈ ఇద్దరిపైనే..
సమ్మర్ గ్రీన్ వేవ్.. ఇంట్లో మొక్కల అద్దె ట్రెండ్
సమ్మర్ గ్రీన్ వేవ్.. ఇంట్లో మొక్కల అద్దె ట్రెండ్
అయోధ్య రామాలయంలో భక్తుల ప్రదక్షిణ కోసం సొరంగం నిర్మాణం..
అయోధ్య రామాలయంలో భక్తుల ప్రదక్షిణ కోసం సొరంగం నిర్మాణం..
ఇంటర్‌ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా టాప్.. రేపట్నుంచి రీ-వెరిఫికేషన్!
ఇంటర్‌ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా టాప్.. రేపట్నుంచి రీ-వెరిఫికేషన్!
కూల్ గా ఉండాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా దోసకాయని తినాల్సిందే
కూల్ గా ఉండాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా దోసకాయని తినాల్సిందే
రోజూ వాకింగ్‌కి వెళ్తున్నారా..? ఇలా నడిస్తేనే ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ వాకింగ్‌కి వెళ్తున్నారా..? ఇలా నడిస్తేనే ఆరోగ్య ప్రయోజనాలు..
ఇంటర్ ఫెయిలైన వారికి అలర్ట్.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పట్నుంచంటే?
ఇంటర్ ఫెయిలైన వారికి అలర్ట్.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పట్నుంచంటే?
ఇలా చేస్తే రాలిన చోట జుట్టు తిరిగొస్తుంది..
ఇలా చేస్తే రాలిన చోట జుట్టు తిరిగొస్తుంది..
'యానిమల్' విలన్‌ లవ్ స్టోరీనే రిపీట్ చేసిన టీమిండియా ప్లేయర్
'యానిమల్' విలన్‌ లవ్ స్టోరీనే రిపీట్ చేసిన టీమిండియా ప్లేయర్
ఈ వీకెండ్ లో వన్‌ డే టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా..? హైదరాబాద్‌కు
ఈ వీకెండ్ లో వన్‌ డే టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా..? హైదరాబాద్‌కు