Naga Chaitanya: ఇంట్లోనూ అలా ఉంటామని కాదు.. రానా నాయుడు వెబ్‌ సిరీస్‌పై నాగ చైతన్య కామెంట్స్‌ వైరల్‌

దగ్గుబాటి హీరోలు వెంకటేష్‌, రానా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ రానా నాయుడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్ ఫ్లిక్స్ మార్చి 10న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌ అయ్యింది. అయితే రానానాయుడు వెబ్ సిరీస్ పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఫ్యామిలీ హీరోగా ముద్రపడిన వెంకటేష్ ..

Naga Chaitanya: ఇంట్లోనూ అలా ఉంటామని కాదు.. రానా నాయుడు వెబ్‌ సిరీస్‌పై నాగ చైతన్య కామెంట్స్‌ వైరల్‌
Naga Chaitanya
Follow us
Basha Shek

|

Updated on: May 12, 2023 | 9:00 AM

దగ్గుబాటి హీరోలు వెంకటేష్‌, రానా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ రానా నాయుడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్ ఫ్లిక్స్ మార్చి 10న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌ అయ్యింది. అయితే రానానాయుడు వెబ్ సిరీస్ పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఫ్యామిలీ హీరోగా ముద్రపడిన వెంకటేష్ ఇలాంటి వెబ్ సిరీస్ చేయడం పై చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక సిరీస్‌లో బూతులు యథేచ్చగా వాడేశారని, సిరీస్‌ నిండా అసభ్యకరమైన సీన్లు ఉన్నాయంటూ చాలామంది కామెంట్లు చేశారు. అయితే బోల్డ్‌ కంటెంట్‌తో తెరకెక్కిన రానానాయుడు వెబ్‌ సిరీస్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌లో రికార్డులు కొల్లగొట్టింది. భారీ వ్యూస్‌ సొంతం చేసుకుంది. పైగారిలీజుకు ముందుగానే ఈ సిరీస్ కుటుంబంతో కలిసి చూసేది కాదు అని క్లారిటీ ఇచ్చారు రానా, వెంకటేష్. తాజాగా రానానాయుడు వెబ్‌ సిరీస్, అందులో నటించినందుకు వెంకటేష్‌పై విమర్శలు రావడంపై అక్కినేని నాగచైతన్య స్పందించారు. తన తాజా చిత్రం కస్టడీ ఇవాళ (మే 12) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న అతను రానానాయుడు సిరీస్‌పై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు.

‘వెంకటేష్‌గారికి తెలుగు రాష్ట్రాల్లో మొదటి నుంచి ఫ్యామిలీ హీరో ఇమేజ్‌ ఉన్నమాట వాస్తవమే. రానా నాయుడు సిరీస్‌ చూసి ప్రేక్షకులు షాక్‌ అయ్యుండొచ్చు కానీ నటుడు అన్నాకా అన్ని రకాలు చేస్తేనే కదా మనకి ఎదుగుదల ఉంటుంది. నటుడిగా కొత్తగా ట్రై చేశామంటే ఇంట్లో కూడా అలా ఉంటామని కాదు కదా’ అని చెప్పుకొచ్చారు నాగ చైతన్య. కాగా కస్టడీ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించారు. అరవింద్‌ స్వామి, శరత్‌ కుమార్‌, రేవతి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మ్యాస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకు స్వరాలు సమకూర్చడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుపై జీఎస్టీ బాదుడు.. ఎంత పెంచారంటే..?
సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుపై జీఎస్టీ బాదుడు.. ఎంత పెంచారంటే..?
చలికాలంలో పచ్చిబఠానీలు తింటే ఆరోగ్యానికి కలిగేప్రయోజనాలు తెలిస్తే
చలికాలంలో పచ్చిబఠానీలు తింటే ఆరోగ్యానికి కలిగేప్రయోజనాలు తెలిస్తే
తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. ఎవరు, ఎంతిచ్చారంటే..?
తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. ఎవరు, ఎంతిచ్చారంటే..?
ఢిల్లీలో ఎన్డీఏ నేతల కీలక సమావేశం.. హాజరైన సీఎం చంద్రబాబు..
ఢిల్లీలో ఎన్డీఏ నేతల కీలక సమావేశం.. హాజరైన సీఎం చంద్రబాబు..
Gold Rates in 2025: పసిడి ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?
Gold Rates in 2025: పసిడి ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?
శ్రీ తేజ్‌కుటుంబానికి అండగా వేణు స్వామి.. 2 లక్షల ఆర్థిక సాయం
శ్రీ తేజ్‌కుటుంబానికి అండగా వేణు స్వామి.. 2 లక్షల ఆర్థిక సాయం
వారానికి ఒక గ్లాస్‌ చెరకు రసం తాగితే చాలు..!అద్భుతమైన ప్రయోజనాలు
వారానికి ఒక గ్లాస్‌ చెరకు రసం తాగితే చాలు..!అద్భుతమైన ప్రయోజనాలు
ఇది సార్ టాలీవుడ్ రూలు.. బాలీవుడ్‎ని ఏలేస్తున్న తెలుగు హీరోలు..
ఇది సార్ టాలీవుడ్ రూలు.. బాలీవుడ్‎ని ఏలేస్తున్న తెలుగు హీరోలు..
ఎన్టీఆర్ కథ లీక్ చేసిన దర్శకుడు..
ఎన్టీఆర్ కథ లీక్ చేసిన దర్శకుడు..
ఆ కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మతిపోయే బహుమతులు అందజేత
ఆ కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మతిపోయే బహుమతులు అందజేత