Sreemukhi: పుట్టినరోజున పులులతో శ్రీముఖి ఆటలు.. ఈ బుల్లితెర రాములమ్మకు ఎంత ధైర్యమో.. వీడియో వైరల్‌

బుధవారం (మే10)న శ్రీముఖి పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు బర్త్‌ డే విషెస్‌ తెలిపారు. ఇక తన పుట్టిన రోజు వేళ థాయిలాండ్ లో వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తోందీ అమ్మడు.

Sreemukhi: పుట్టినరోజున పులులతో శ్రీముఖి ఆటలు.. ఈ బుల్లితెర రాములమ్మకు ఎంత ధైర్యమో.. వీడియో వైరల్‌
Sreemukhi
Follow us

|

Updated on: May 11, 2023 | 6:05 AM

బుల్లితెరపై గలాగలా మాట్లాడుతూ యాంకరింగ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. ప్రస్తుతం అరడజనకు పైగా టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్‌తో ఓ కీలక పాత్రలో నటిస్తోందీ అమ్మడు. బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న శ్రీముఖికి సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఆమె షేర్‌ చేసే గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోస్‌కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుంటుంది. కాగా బుధవారం (మే10)న శ్రీముఖి పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు బర్త్‌ డే విషెస్‌ తెలిపారు. ఇక తన పుట్టిన రోజు వేళ థాయిలాండ్ లో వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తోందీ అమ్మడు. తాజాగా ఫుకెట్‌ నగరంలోని ఓ జూ పార్క్‌ను సందర్శించింది శ్రీముఖి. అక్కడి పెద్ద పులులతో ఆడుకుంటూ సందడి చేసింది.

అనంతరం అక్కడ పెద్దపులిని తాకుతూ ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలామంది నెటిజన్లు శ్రీముఖి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. బుల్లితెర రాములమ్మ ధైర్యానికి ఏదైనా లొంగాల్సిందేనంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ‘జాగ్రత్త అక్క.. ఏ మాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు’ అంటూ శ్రీముఖిని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

శ్రీముఖి ఇన్ స్టా పోస్ట్

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?