Arijit Singh: షేక్‌ హ్యాండ్‌ ఇచ్చిన స్టార్‌ సింగర్‌ను గట్టిగా లాగేసిన లేడీ ఫ్యాన్‌.. గాయపడ్డ అర్జిత్‌ సింగ్‌.. వైరల్‌ వీడియో

ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ అర్జిత్‌ సింగ్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన పాటలకు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. హిందీ చిత్ర పరిశ్రమంలో స్టార్‌ సింగర్‌గా వెలుగొందుతోన్న ఆయన తెలుగులోనూ కొన్ని సినిమాలకు తన గాత్రం వినిపించారు.

Arijit Singh: షేక్‌ హ్యాండ్‌ ఇచ్చిన స్టార్‌ సింగర్‌ను గట్టిగా లాగేసిన లేడీ ఫ్యాన్‌.. గాయపడ్డ అర్జిత్‌ సింగ్‌.. వైరల్‌ వీడియో
Arijith Singh
Follow us
Basha Shek

|

Updated on: May 10, 2023 | 7:05 AM

ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ అర్జిత్‌ సింగ్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన పాటలకు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. హిందీ చిత్ర పరిశ్రమంలో స్టార్‌ సింగర్‌గా వెలుగొందుతోన్న ఆయన తెలుగులోనూ కొన్ని సినిమాలకు తన గాత్రం వినిపించారు. స్వామి రారా, దోచేయ్, హుషారు, ఉయ్యాల జంపాల, భలే మంచి రోజు తదితర సినిమాల్లో అర్జిత్‌ ఆలపించిన పాటలు సంగీతాభిమానులను ఉర్రూతలూగించాయి. ఇదిలా ఉంటే సినిమాల్లో పాటలు పాడుతూనే బయట లైవ్‌ కాన్సర్ట్‌ల్లోనూ పాల్గొంటున్నాడు అర్జిత్‌. ఇటీవలే ఐపీఎల్‌ ఆరంభ వేడుకల్లోనూ పాటలు ఆలపించి అందరినీ అలరించాడీ స్టార్ సింగర్‌. ఇందులో భాగంగా తాజాగా ఔరంగాబాద్‌లోని రిద్ధి సిద్ధి ల్యాండ్‌ మార్క్‌లో ఓ లైవ్‌ కాన్సర్ట్‌ నిర్వహించాడు అర్జిత్‌. ఈ కాన్సర్ట్‌లో అర్జిత్‌ పాటలు పాడుతూ స్టేజీ దగ్గరున్న అభిమానులకు సరదాగా షేక్‌ హ్యాండ్‌ ఇస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించింది. షేక్‌ హ్యాండ్‌ ఇవ్వాలని ప్రయత్నిస్తూ అర్జిత్‌ను గట్టిగా లాగింది. దీంతో ఒక్కసారిగా అర్జిత్‌ కిందపడిపోబోయాడు. అనుకోకుండా జరిగిన ఈ పరిణామంతో అతని చేయికి గాయమైంది. దీంతో కొంత అసహనం వ్యక్తం చేశాడీ బాలీవుడ్ స్టార్‌ సింగర్‌. తనను కిందకు లాగిన మహిళను సున్నితంగా హెచ్చరించారు.

‘మీరు ఇలా చేయడం వల్ల నా చేతికి గాయమైంది. నా హ్యాండ్‌ షేక్‌ అవుతుంది. నేను చేయిని కదపలేకపోతున్నాను’ దాంతో ఆ మహిళా అభిమాని క్షమాపణ కోరింది. తను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో అర్జిత్‌కు వివరించించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. . దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘అభిమానం హద్దులు దాటింది’, ‘మీరు త్వరగా కోలుకోవాలి’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?