Guntur Kaaram:సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మాస్ యాక్షన్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ గుంటూరు కారం. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది ఈ సినిమా. ఆగస్ట్ 9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా 12.06 నిమిషాలకు సినిమా అప్‌డేట్ విడుదల చేసారు మేకర్స్. దాంతో పాటు బిజినెస్ మెన్ 4K వర్షన్ కూడా థియేటర్లలో ఎంజాయ్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.