AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా..?

Gold Price Today: అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం 5145 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ కారణంగానే బంగారం ధర దేశీయ మార్కెట్లో కూడా భారీగా పెరుగుతున్నట్లు గమనించవచ్చు. బంగారం ధర పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఉన్న..

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా..?
Gold Price Today
Subhash Goud
|

Updated on: Feb 23, 2026 | 6:18 AM

Share

Gold, Silver Prices: ప్రతి రోజు బంగారం, వెండి ధరలు కీలకంగా మారుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెండింతలు పెరుగుతోంది. నేడు ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం బంగారం, వెండి ధరలు అతి స్వల్పంగా తగ్గినప్పటికీ ఇంకా భారీగానే ఉన్నాయి. తులం ధర రూ.1.60 లక్షల చేరువలో ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,59,270 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,45,990 పలుకుతోంది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర అతి స్వల్పంగా తగ్గింది. అంటే కేవలం పది రూపాయలు మాత్రమే తగ్గింది. అయితే దేశంలో వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరల్లో తేడా ఉండవచ్చు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల జీఎస్టీ, ఇతర ఛార్జీల కారణంగా మార్పులు ఉంటాయని గుర్తించుకోండి.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

  1. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,270 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,45,990 వద్ద కొనసాగుతోంది.
  2. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,270 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,990 వద్ద ఉంది.
  3. హైదరాబాద్‌, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,270 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,990 వద్ద ఉంది.
  4. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,270 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,990 వద్ద ఉంది.
  5. ఇవి కూడా చదవండి
  6. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,140 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,790 వద్ద ఉంది.
  7. ఇక వెండి విషయానికొస్తే కిలో ధర రూ.2,74,900 వద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: Investment: రూ.3 లక్షలు డిపాజిట్‌ చేస్తే కళ్లు చెదిరే లాభం.. పొదుపు చేయాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్..!

అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం 5145 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ కారణంగానే బంగారం ధర దేశీయ మార్కెట్లో కూడా భారీగా పెరుగుతున్నట్లు గమనించవచ్చు. బంగారం ధర పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులే కారణంగా చెప్పవచ్చు. నిజానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ పై తీసుకున్న నిర్ణయాలను రద్దు చేస్తూ అమెరికన్ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం పెద్ద ఎత్తున ఇన్వెస్టర్ లలో పాజిటివ్ సెంటిమెంట్ ను ప్రేరేపిస్తుందని అంతా భావించినప్పటికీ, కానీ అటు డాలర్ విలువ తగ్గడంతో బంగారం ధరలు మళ్లీ పెరగడం చూడవచ్చు. ప్రస్తుతం బంగారం ధర ఆల్ టైం రికార్డ్ తో పోల్చి చూస్తే 25 వేల రూపాయలు తక్కువగా ఉందని చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి: Indian Railways: ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 3 వరకు ఈ రైళ్లన్ని రద్దు!

అయితే వచ్చే వారం బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ సుంకాలను పెంచాలనే నిర్ణయం, పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను సురక్షిత స్వర్గధామాలను వెతుక్కునేలా చేస్తున్నాయని వారు విశ్వసిస్తున్నారు. మార్కెట్ కదలికను అంచనా వేయడానికి, పెట్టుబడిదారులు అమెరికా ఉత్పత్తిదారుల ధరల సూచిక, ప్రజా ఆర్థిక విశ్వాసం, వారపు నిరుద్యోగ వాదనలు, మరియు చైనా కేంద్ర బ్యాంకు వడ్డీ రేటు నిర్ణయం వంటి కీలక ఆర్థిక డేటాను పర్యవేక్షిస్తారు.

ఇది కూడా చదవండి: పోస్టాఫీసులో కేవలం ఏడాదికి రూ.899తో రూ.15 లక్షల ఇన్సూరెన్స్!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us