పీఎఫ్ ఖాతాదారులకు సూపర్ న్యూస్.. ఆటోమేటిక్‌గా అకౌంట్లోకి డబ్బులు..
Venkatrao Lella
Images: Pinterest
01 NOV 2026
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి సూపర్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం నవంబర్ 1 నుంచి రెండు కొత్త సర్వీసులు ప్రారంభిస్తోంది. ఢిల్లీలో జరగనున్న ఈపీఎఫ్ఓ 74వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ కొత్త సేవలను ప్రారంభిస్తున్నారు.
ఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా వీటిని లాంచ్ చేయనున్నారు. పీఎఫ్ సేవలను వేగంగా ఖాతాదారులు పొందటంలో ఇవి సహాయపడనున్నాయి. ఈ రెండు సర్వీసులు ఏంటనేది తెలుసుకుందాం.
పీఎఫ్ ఖాతాదారుల కోసం వాట్సప్ సేవలను తీసుకొస్తున్నారు. దీని ద్వారా వాట్సప్‌లోనే పీఎఫ్ సేవలు సులువుగా పొందవచ్చు. బ్యాంకుల వాట్సప్ సర్వీసుల తరహాలోనే ఈ కొత్త సర్వీసులు ఉంటాయి.
వాట్సప్‌లోనే పీఎఫ్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్, క్లెయిమ్ ట్రాకింగ్ వంటివి యాక్సెస్ చేయవచ్చు. ఇప్పటివరకు వీటి కోసం ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో లాగిన్ అవ్వాల్సి వచ్చేది. లేదా ఉమాంగ్ యాప్‌లోకి వెళ్లాల్సి వచ్చేది.
ఇక నుంచి పీఎఫ్ వెబ్ సైట్, ఉమాంగ్ యాప్‌లోకి వెళ్లకుండానే సులువుగా వాట్సప్‌లోనే అన్నీ సేవలు పొందవచ్చు. దీని వల్ల ఖాతాదారులకు సమయం ఆదా అవ్వడంతో పాటు సులభంగా ఏ సమాచారం అయినా తెలుసుకోవచ్చు.
అయితే ఏయే సేవలను వాట్సప్ సర్వీసుల్లో అందుబాటులోకి తీసుకొస్తాయనే వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సర్వీసులు ప్రారంభించిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది.
ఇనాక్టివ్ అయిన అకౌంట్లలోని సొమ్మును ఆటోమేటిక్‌గా ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్లకు బదిలీ చేసే ఫీచర్‌ను నవంబర్ 1న ప్రారంభించనున్నారు. రూ.వెయ్యి లేదా అంతకంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న ఇనాక్టివ్ ఖాతాల్లోని సొమ్మును ఆటోమేటిక్‌గా సెటిల్ చేస్తారు.
చాలామంది ఉద్యోగులు జాబ్‌లు మారుతుంటారు. తక్కువ బ్యాలెన్స్ ఉన్నప్పుడు వాటిని విత్ డ్రా చేసుకోకుండా అలాగే వదిలేస్తుంటారు. కొంతమంది తక్కువ అమౌంట్ కదా అని విత్ డ్రా చేసుకోవడం మర్చిపోతుంటారు.
తక్కువ బ్యాలెన్స్ కలిగి ఉన్న ఇనాక్టివ్ అకౌంట్లను తొలగించాలనే ఉద్దేశంతో ఆటో సెటిల్మెంట్ విధానం ఈపీఎఫ్ఓ తీసుకొస్తుంది. అర్హత కలిగిన పీఎఫ్ అకౌంట్లకు ఇది వర్తిస్తుంది.