- Telugu News Photo Gallery Cinema photos Actress Namita Campaign in Chikkapete in Bengaluru for BJP Candidate Uday Garudachar
Namitha: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అందాల తార నమిత.. కమలం పార్టీకి సపోర్టుగా.. ఫొటోస్ వైరల్
ప్రముఖ నటి నమిత కన్నడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. నగరంలోని చిక్కపేటలో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసింది. ఈ సందర్భంగా నమితను చూడడానికి జనం పెద్దసంఖ్యలో వచ్చారు.
Updated on: May 09, 2023 | 9:40 AM

ప్రముఖ నటి నమిత కన్నడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. నగరంలోని చిక్కపేటలో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసింది. ఈ సందర్భంగా నమితను చూడడానికి జనం పెద్దసంఖ్యలో వచ్చారు.

చిక్కపేటలో బీజేపీ అభ్యర్థి ఉదయ్ గరుడాచార్ తరపున నమిత ప్రచారం నిర్వహించారు. ఉదయ్ గరుడాచార, బీజేపీకి ఓటు వేయండంటూ ఓటర్లను అభ్యర్థించారు.

కాగా కన్నడతో పాటు తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేసింది నమిత. సొంతం, జెమిని, ఒక రాజు ఒక రాణి, బిల్లా, సింహా తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.

2017లో వీరేంద్ర చౌదరితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. వీరికి ఇటీవలే కవలలు పుట్టారు. ప్రస్తుతం తన కుటుంబాన్ని చూసుకునే పనిలో బిజీగా ఉంది నమిత.

బుధవారం (మే10) కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నమితతో పాటు సుదీప్, శివరాజ్‌కుమార్, బ్రహ్మానందం వంటి సినిమా స్టార్లు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.




