AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: అలాంటివాటిని నా దగ్గరకు కూడా రానివ్వను.. గట్టిగ ఇచ్చిపడేసిన సమంత

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తిరిగి సినిమాల్లో బిజీ అవుతుంది. సమంత ఇటీవలే నిర్మాతగా మారింది. రీసెంట్ గానే శుభం అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఏలింది సమంత.. ఏ స్టార్ హీరో సినిమా చూసినా హీరోయిన్ గా సమంతానే ఉండేది.

Samantha: అలాంటివాటిని నా దగ్గరకు కూడా రానివ్వను.. గట్టిగ ఇచ్చిపడేసిన సమంత
Samantha
Rajeev Rayala
|

Updated on: Feb 23, 2026 | 7:55 AM

Share

స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు సినిమాల స్పీడ్ పెంచేశారు. ఓ వైపు నిర్మాతగా మరో వైపు హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉన్నారు. మొన్నామధ్య శుభం అనే సినిమాతో నిర్మాతగా మారి మంచి విజయాన్ని అందుకుంది సామ్. ఇక ఇప్పుడు హీరోయిన్ గా మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. మా ఇంటి బంగారం అనే సినిమాతో సామ్ రానుంది. ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ కథతో తెరకెక్కిందని తెలుస్తుంది. పెళ్లి తర్వాత సమంత నుంచి వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం.. ఈ చిత్రం మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే సామ్ తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది.

అభిమానులు అడిగిన ప్రశ్నలకు సామ్ ఆసక్తికర సమాదానాలు పంచుకుంది. కాగా సోషల్ మీడియాలో వచ్చే పాజిటివ్ అలాగే నెగిటివ్ రియాక్షన్స్ మీద కామెంట్స్ అని ఓ నెటిజన్ అడగ్గా సామ్ ఆసక్తికర సమాధానం చెప్పింది. ప్రశంసలు నన్ను కదిలించలేవు. అలాగే విమర్శలు కూడా నాపై పెద్దగా ఎఫెక్ట్‌ చూపించావు. నేను వాటిని పట్టించుకోను. కానీ, నెగెటివిటీని నా ఇంటివరకు తీసుకొస్తే మాత్రం మిమ్మల్ని బ్లాక్‌ చేస్తాను అని తెలిపింది. అంతే కాదు నేను మిమ్మల్ని బ్లాక్ చేశాను అంటే నేను బాధపడ్డట్టు కాదు.. మీలాంటి వారికి నా దాగ్గర చోటు లేదు అని అర్ధం అని తెలిపింది సామ్.

అదేవిధంగా.. మరో నెటిజన్  మీలోని ఓ ఫన్నీ థింగ్‌ ఏంటి అని అడగ్గా.. దానికి సమాధానమిస్తూ.. నాకు బాగా నవ్వు వస్తే కిందపడి మరీ నవ్వుతాను అని తెలిపింది. ఎక్కువ బాధ లేదా ఒత్తిడికి గురైనప్పుడు ఏం చేస్తారని అడగ్గా.. మెడిటేషన్  చేస్తానని  తెలిపింది సమంత. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. సమంత విషయానికొస్తే ఇటీవలే రాజ్ ను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం చాలా సింపుల్ గా జరిగింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ రాశులకు 50 రోజుల పండుగ! ఐశ్వర్యవంతులు కావడం పక్కా..
ఈ రాశులకు 50 రోజుల పండుగ! ఐశ్వర్యవంతులు కావడం పక్కా..
SRHకు కోలుకోలేని దెబ్బ.. దూరమైన మ్యాచ్ విన్నర్.. కట్‌చేస్తే..
SRHకు కోలుకోలేని దెబ్బ.. దూరమైన మ్యాచ్ విన్నర్.. కట్‌చేస్తే..
ఓరీ దేవుడో మీ డబ్బులకు దండం! బతికి ఉంటే చాలు..ఏసీ టెక్నీషియన్ మాట
ఓరీ దేవుడో మీ డబ్బులకు దండం! బతికి ఉంటే చాలు..ఏసీ టెక్నీషియన్ మాట
మా హీరోయిన్‌ను ఇంతలా అవమానిస్తారా? ఫైరవుతోన్న త్రిష ఫ్యాన్స్
మా హీరోయిన్‌ను ఇంతలా అవమానిస్తారా? ఫైరవుతోన్న త్రిష ఫ్యాన్స్
ఇలా ఉన్నారేంట్రా.. లెగ్ పీస్ కోసం రచ్చ రచ్చ.. అసలేం జరిగిందంటే..?
ఇలా ఉన్నారేంట్రా.. లెగ్ పీస్ కోసం రచ్చ రచ్చ.. అసలేం జరిగిందంటే..?
కేతు యోగం..ఆ రాశుల వారికి సొంత ఊర్లోనే ఉద్యోగం..!
కేతు యోగం..ఆ రాశుల వారికి సొంత ఊర్లోనే ఉద్యోగం..!
క్రేజీ ఫోటోలతో మెంటలెక్కిస్తున్న మహేష్ బాబు మేనకోడలు..
క్రేజీ ఫోటోలతో మెంటలెక్కిస్తున్న మహేష్ బాబు మేనకోడలు..
గుమ్మడిపై ఆగ్రహించిన ఎన్టీఆర్.. నాలుగేళ్లు దూరం పెట్టారు..
గుమ్మడిపై ఆగ్రహించిన ఎన్టీఆర్.. నాలుగేళ్లు దూరం పెట్టారు..
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా..? శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా..? శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..
ఆఫీస్ బాయ్ అన్న ఆ మాటతో హిట్లర్ సినిమా స్క్రిప్ట్ మారిపోయింది..
ఆఫీస్ బాయ్ అన్న ఆ మాటతో హిట్లర్ సినిమా స్క్రిప్ట్ మారిపోయింది..