AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ananya Nagalla: మూడేళ్లు బ్రేకప్ బాధతోనే బతికా.. శాడ్ బ్రేకప్ స్టోరీ

Ananya Nagalla: మూడేళ్లు బ్రేకప్ బాధతోనే బతికా.. శాడ్ బ్రేకప్ స్టోరీ

Phani CH
|

Updated on: May 22, 2026 | 4:01 PM

Share

నటి అనన్య నాగళ్ల తన బ్రేకప్ బాధ గురించి ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగంగా మాట్లాడింది. ఒక వ్యక్తిని బాగా నమ్మి మోసపోయానని, ఆ బాధను మూడేళ్లపాటు అనుభవించానని తెలిపింది. షూటింగ్ సమయంలో కూడా కేరవాన్‌లో ఏడ్చేదాన్నని చెప్పిన అనన్య, అమ్మాయిల భావోద్వేగాలను సమాజం సరిగా అర్థం చేసుకోవడం లేదంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య నాగళ్ల సినిమాల్లోక రాక ముందు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కొన్నాళ్లు వర్క్ చేసింది. అయితే నటనపై ఆసక్తితో మొదట షార్ట్ ఫిల్మ్స్ చేసింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మల్లేశం సినిమాతో వెండితెరకు పరిచయమైన అనన్య అతి కొద్ది కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు హీరోయిన్ గా మెప్పిస్తూనే మరోవైపు సహాయక నటిగానూ ఆకట్టుకుంది.ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటోన్న అనన్య రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంది. ఇదే సందర్భంగా తన బ్రేకప్ స్టోరీని కూడా చెప్పి బాధపడింది. ఇటీవలి కాలంలో దేని గురించైనా ఏడ్చావా? ఎందుకు ఏడ్చావని అని అనన్యను యాంకర్ ప్రశ్నించగా .. తన బ్రేకప్ స్టోరీ గురించి చెప్పేసింది. చాలా ఏళ్ల తర్వాత బాగా ఏడ్చానని.. అది కూడా ఒక వ్యక్తి వల్ల అంటూ చెప్పింది. ‘ఒక వ్యక్తిని తాను బాగా నమ్మాను. కానీ మోసపోయాను. ఉదయాన్నే నిద్రలేవగానే ఆ ఆలోచనలే వెంటాడతాయి. ఎంత బిజీగానే ఉన్నా అవే గుర్తొస్తూనే ఉంటాయి. బ్రేకప్ తాలూకా బాధను మూడేళ్లపాటు అనుభవించా. అయితే షూటింగ్స్‌కి మాత్రం అస్సలు మిస్ అయ్యే దానిని కాదు’అంటూ చెప్పుకొచ్చింది అనన్య. బ్రేకప్ బాధతో… రాత్రంతా ఏడ్చినా తెల్లవారగానే జిమ్‌కి వెళ్లిపోయేదాన్ననీ , షూటింగ్‌లో కేరవాన్‌లోనే కూర్చొని తన షాట్ వచ్చే వరకు వెక్కి వెక్కి ఏడ్చేదాన్నంటూ అనన్య ఎమోషనల్ అయింది. ఆ తర్వాత కళ్లు తుడుచుకుని తన పని చూసుకునేదానినని చెప్పింది. ‘నాకు తెలిసి చాలా మంది అమ్మాయిలకు ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అమ్మాయిలు చాలా సెన్సిటివ్. అమ్మాయిలు వదిలేసి వెళ్లిపోతారని చాలా మీమ్స్ సోషల్ మీడియాలో వస్తుంటాయి. ఎన్నో మాటలు అంటారు. అబ్బాయిలు ఎక్కువగా ఉండటం, కంటెంట్ క్రియేటర్స్ కూడా వాళ్లే ఉండటం వల్ల వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూ బయటకు వస్తుంది. మన పాయింట్ ఆఫ్ వ్యూ బయటకు రావడం లేదు’ అంటూ అనన్య ఎమోషనలైంది. ప్రస్తుతం ఈ తెలుగమ్మాయి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jayam Ravi: నెలకు 40 లక్షలు ఇవ్వాల్సిందే! భార్య డిమాండ్ విని.. షాక్‌లో స్టార్‌ హీరో!

Peddi: పెద్ది మూవీకి ఐబొమ్మ టెన్షన్..! భారీ యాక్షన్‌కు సిద్ధమైన మేకర్స్

Dragon: 4 నిమిషాల్లోనే సోషల్ మీడియా షేక్.. డ్రాగన్‌తో ఆల్‌టైమ్ రికార్డ్ కొట్టిన ఎన్టీఆర్

Peddi: ఉప్పెన ట్విస్ట్‌ కంటే పెద్దిలో 100 రెట్లు ట్విస్ట్! చరణ్ బిగ్ హింట్!

Ram Charan: పెద్ది సినిమా ఏమో కానీ.. నా కూతురిని ఎత్తుకోలేకపోతున్నా

Follow Us