AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi: ఉప్పెన ట్విస్ట్‌ కంటే పెద్దిలో 100 రెట్లు ట్విస్ట్! చరణ్ బిగ్ హింట్!

Peddi: ఉప్పెన ట్విస్ట్‌ కంటే పెద్దిలో 100 రెట్లు ట్విస్ట్! చరణ్ బిగ్ హింట్!

Phani CH
|

Updated on: May 22, 2026 | 3:51 PM

Share

‘పెద్ది’ సినిమాలోని ఢిల్లీ ఎపిసోడ్‌ ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తుందని రామ్ చరణ్ వెల్లడించారు. బుచ్చిబాబుతో చేసిన స్పెషల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘ఉప్పెన’ క్లైమాక్స్ ట్విస్ట్ కంటే 100 రెట్లు ఎక్కువ సర్ప్రైజ్ ఈ ఎపిసోడ్‌లో ఉంటుందని చెప్పారు. దీంతో ‘పెద్ది’పై మెగా అభిమానుల అంచనాలు మరింత పెరిగిపోయాయి. జూన్ 4న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా కలయికలో వస్తున్న ‘పెద్ది’ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వినూత్నంగా నిర్వహిస్తోంది. తాజాగా రామ్ చరణ్, బుచ్చిబాబు కలిసి కార్ డ్రైవ్ చేస్తూ ముచ్చటించిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.అందులోనూ ఈ ఇంటర్వ్యూలో చరణ్ చెప్పిన ఓ విషయం కాస్త ఇంట్రెస్టింగ్‌ గా మారింది. ‘సినిమా మొత్తంలో మీకు ఇష్టమైన ఎపిసోడ్ ఏది?’ బుచ్చిబాబు చరణ్‌ను అడగ్గా, చరణ్ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. పెద్ది సినిమాలో వచ్చే ‘ఢిల్లీ ఎపిసోడ్’ తనకు అత్యంత ఇష్టమైన భాగమని చరణ్ వెల్లడించారు. కథ పరంగా ఈ ఎపిసోడ్‌లో వచ్చే మలుపులు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయని, సినిమాలోనే ఇది అత్యంత కీలకమైన ఘట్టమని చరణ్ చెప్పారు. ముఖ్యంగా ఈ ఢిల్లీ ఎపిసోడ్ గురించి చెబుతూ.. బుచ్చిబాబు డెబ్యూ మూవీ ‘ఉప్పెన’ క్లైమాక్స్ ట్విస్ట్‌తో పోల్చారు. ఉప్పెన సినిమాలో వచ్చే ట్విస్ట్‌ కంటే 100 రెట్లు ఎక్కువ షాకింగ్ ట్విస్టులు ఈ ఢిల్లీ ఎపిసోడ్‌లో ఉంటాయని చరణ్ అనడంతో మెగా అభిమానుల్లో అంచనాలు స్కై హైకి చేరాయి. ఈ ఒక్క స్టేట్‌మెంట్‌తో ‘పెద్ది’ సినిమాలో ఊహించని మైండ్ బ్లోయింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: పెద్ది సినిమా ఏమో కానీ.. నా కూతురిని ఎత్తుకోలేకపోతున్నా

కోట్లు ఇచ్చినా రాని ఆనందం.. రైతన్నను మురిపించిన నేల తల్లి

సీఎం సార్.. నన్ను అమ్మేశారు.. కాపాడండి ప్లీజ్‌

Follow Us