AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం సార్.. నన్ను అమ్మేశారు.. కాపాడండి ప్లీజ్‌

సీఎం సార్.. నన్ను అమ్మేశారు.. కాపాడండి ప్లీజ్‌

Phani CH
|

Updated on: May 22, 2026 | 3:41 PM

Share

ఉపాధి కోసం కువైట్ వెళ్లిన తిరుపతి జిల్లా మహిళ భాగ్యవతి అక్కడ తీవ్ర వేధింపులకు గురవుతున్నానంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తనను గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నారని, ఏజెంట్లు అమ్మేశామని చెబుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను కాపాడాలని వేడుకున్న ఈ వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది.

ఇటీవల కాలంలో బ్రతుకుతెరువుకోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్తున్నవారి సంఖ్య రోజు రోజుకీ ఎక్కువవుతోంది. ఆర్ధిక సమస్యలనుంచి గట్టెక్కవచ్చని, కుటుంబాన్ని చక్కగా పోషించుకోవచ్చని గంపెడాశతో అయినవారిని వదిలి పొట్ట చేతపట్టుకొని అప్పులు చేసుకొని మరీ విదేశాలకు వెళ్తున్నారు. అయితే అక్కడ వారికి ఎదురయ్యే పరిస్థితులు వేరు. పనిచేసే ప్రదేశంలో యజమానుల చేత తీవ్ర వేధింపులకు గురవుతూ…క్షణక్షణం నరకం అనుభవిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వారి వేధింపులు తాళలేక తమ గోడును ప్రభుత్వాలకు విన్నవించుకుంటూ కాపాడమని వేడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన ఓ తెలుగు మహిళ అక్కడ దారుణమైన వేధింపులకు గురవుతోంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన భాగ్యవతి అనే మహిళ మూడు నెలల క్రితం పీలేరుకు చెందిన ఒక ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్లింది. అయితే అక్కడ తనను ఒక చోట బంధించి, చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆమె కన్నీరుమున్నీరవుతూ పంపిన సెల్ఫీ వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆ వీడియోలో.. “ఇక్కడి ఏజెంట్ నన్ను అమ్మేసినట్టు చెబుతున్నారు. నన్ను ఒక గదిలో బంధించి దారుణంగా వేధిస్తున్నారు. కనీసం ఫోన్ వాడనివ్వడం లేదు. ఇంటికి వెళ్ళిపోతానన్నా వినడం లేదు” అంటూ భాగ్యవతి ఆ వీడియోలో తన ఆవేదనను పంచుకుంది. తనను ఎలాగైనా కాపాడాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు ఆమె చేతులు జోడించి విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఈ దారుణంపై భాగ్యవతి తల్లి చంద్రగిరి పోలీసులను ఆశ్రయించింది. తన కుమార్తెను మోసం చేసి కువైట్ పంపిన ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పందించి తన బిడ్డను సురక్షితంగా స్వదేశానికి రప్పించేలా సాయం చేయాలని ఆమె కన్నీళ్లతో వేడుకుంటోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్‌ లేచి వెళ్లిపోయాడు !

కొమ్ముతో ఏకంగా జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు.. చివరకు..

10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం! బ్యాంకాక్‌లో భారత మహిళ పోస్ట్ వైరల్

కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు

వామ్మో… ఆ ఊరి నిండా పాములే! ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న గ్రామం

Follow Us