కోట్లు ఇచ్చినా రాని ఆనందం.. రైతన్నను మురిపించిన నేల తల్లి
మహబూబ్‌నగర్ జిల్లా ఉదండాపూర్ గ్రామానికి చెందిన రైతు బుడ్డ మల్లయ్య పండించిన వరి పంట ఈసారి భారీ దిగుబడినిచ్చింది. కోత సమయంలో రాశులుగా పడుతున్న ధాన్యాన్ని చూసి ఆనందంతో పొలం అంతా పరుగులు తీస్తూ సంబరపడిపోయాడు. “నా నేలతల్లి నన్ను మోసం చేయలేదు” అంటూ భావోద్వేగానికి గురైన ఈ రైతన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. అధిక దిగుబడినిస్తే ఆ రైతు ఆనందం ఎలా ఉంటుందో తెలుసా… ఈ సీన్ చూస్తే.. పిచ్చ సంతోషంగా ఉంటుంది. ఎన్నిసార్లు నష్టం వచ్చినా నిరాశ చెందకుండా వ్యవసాయాన్నే నమ్ముకుని వరి సాగు చేసిన రైతు కష్టం ఫలించింది.. ఊహించని దిగుబడినిచ్చింది.. దాంతో నేలతల్లి తనను మోసం చేయలేదంటూ పొలం అంతా పరుగులు పెడుతున్న ఆ రైతు ఆనందం చూసి తీరాల్సిందే.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామానికి చెందిన బుడ్డ మల్లయ్య అనే రైతు ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా తన పొలంలో వరి పంటను సాగు చేశాడు. ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా వరి పంట పుష్కలంగా పండి, అత్యధిక దిగుబడి వచ్చింది. పొలంలో కోత మిషన్ వరి కోస్తుండగా.. రాశులుగా పడుతున్న ధాన్యాన్ని చూసి మల్లయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కోట్లు సంపాదించినా రాని సంతోషం తన కళ్లముందే కనిపించడంతో.. తన వయసును కూడా మరిచిపోయి, కేరింతలు కొడుతూ పంట పొలమంతా పరిగెత్తాడు. నా నేలతల్లి నన్ను మోసం చేయలేదు.. ఎప్పటికైనా భూదేవి.. న్యాయం చేస్తుందనుకున్నా. నా నమ్మకం నిజమైంది. ఇంతకన్నా కావాల్సింది ఏముంది” అంటూ మల్లయ్య భావోద్వేగంతో మురిసిపోయాడు. తన పంటను చూసుకొని ఫుల్ హ్యాపీగా గెంతులేస్తున్న ఈ రైతన్న ఆనందం అందరినీ సంతోషపెట్టింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

