Peddi: పెద్ది మూవీకి ఐబొమ్మ టెన్షన్..! భారీ యాక్షన్‌కు సిద్ధమైన మేకర్స్
రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ ట్రైలర్ భారీ హైప్ తెచ్చిపెట్టగా, ఇప్పుడు మూవీ టీమ్ దృష్టి పైరసీ నియంత్రణపై పడింది. జూన్ 3 నుంచే ప్రీమియర్స్ ప్రారంభం కావడంతో ఐబొమ్మ, బప్పం వంటి పైరేటెడ్ సైట్లపై చర్యలకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు పైరసీ పెద్ద ముప్పుగా మారడంతో సైబర్ క్రైమ్ సహకారంతో కఠిన చర్యలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
మొన్న రిలీజ్ అయిన ట్రైలర్‌తో.. పెద్ది హవా మొదలైంది. సౌత్ టూ నార్త్ ఇప్పుడు ఎక్కడ చూసినా.. పెద్ది సినిమా పేరే విపిస్తోంది. క్రాస్ ఓవర్ అథ్లెట్‌గా.. పెద్ది సినిమాలో చరణ్ అదరగొట్టనున్నాడనే విషయం, ట్రైలర్ ఓ రేంజ్‌లో అందరికీ తెలిసేలా చేసింది. దీంతో ఈ మూవీ రిలీజ్ డేట్ జూన్ 4 వైపే అందరి చూపు ఉంది. అయితే మేకర్స్ ఫోకస్ మాత్రం మరో వైపు ఉంది. ఆఫ్టర్ రిలీజ్ పెద్ది మూవీని పైరసీ కాకుండా.. ఎలా రక్షించుకోవాలని వారి ఆలోచిస్తున్నట్టుగా… ఇప్పటి నుంచే యాక్షన్ లోకి దిగుతున్నట్టు గా తెలుస్తోంది. ఎన్నో అంచనాల మధ్య, దాదాపు 300-350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన పెద్ది మూవీ జూన్ 4న రిలీజ్ అవుతున్నప్పటికీ.. జూన్ 3 సాయంత్ర నుంచే పెయిడ్ ప్రీమియర్స్ పడుతున్నాయి. దీంతో కాస్త పైరసీని కట్టడి చేస్తే.. ఈ మూవీ, కలెక్షన్స్ లో రికార్డ్ క్రియేట్ చేస్తుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే నెట్టింట ప్రత్యక్షం అయిన బప్పం, ఐబొమ్మ వంటి పైరేటెడ్ సైట్స్, పెద్ది మూవీని పైరసీ చేయకుండా.. సైబర్ టీంతో కలిసి ప్లాన్స్ చేస్తున్నారట మైత్రీ మేకర్స్. ఐబొమ్మ, బప్పం టీవీ లాంటి సైట్లను బ్లాక్ చేయాలంటూ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌కు పెద్ది టీమ్ కంప్లైంట్ ఇచ్చినట్టు టాక్. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి యాక్షన్ ప్లాన్ చేస్తున్నా, సైట్ ఆపరేటర్లు కొత్త డొమైన్స్, మిర్రర్ లింక్స్‌తో తప్పించుకుంటూ ఉండడం ఇప్పుడు టాలీవుడ్ మేకర్స్‌తో పాటు పెద్ది టీంను కూడా పరేషాన్ చేస్తున్న విషయం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dragon: 4 నిమిషాల్లోనే సోషల్ మీడియా షేక్.. డ్రాగన్‌తో ఆల్‌టైమ్ రికార్డ్ కొట్టిన ఎన్టీఆర్
Peddi: ఉప్పెన ట్విస్ట్ కంటే పెద్దిలో 100 రెట్లు ట్విస్ట్! చరణ్ బిగ్ హింట్!
Ram Charan: పెద్ది సినిమా ఏమో కానీ.. నా కూతురిని ఎత్తుకోలేకపోతున్నా
కోట్లు ఇచ్చినా రాని ఆనందం.. రైతన్నను మురిపించిన నేల తల్లి
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం

